Home » Ileana D’Cruz : పండంటి బాబుకి జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?

Ileana D’Cruz : పండంటి బాబుకి జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?

by Bunty
Ad

టాలీవుడ్ అలనాటి స్టార్ హీరోయిన్ ఇలియానా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సన్నగా నాజుగ్గా ఉండే ఇలియానా అప్పట్లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన సంగతి మనకు తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ హీరోగా నటించిన దేవదాసు సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఇలియానా. ఆ తర్వాత మహేష్ బాబు చేసిన పోకిరి సినిమాతో అందరినీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

Advertisement

ఇక రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైంది ఇలియానా. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఈ అందాల రాసి. ఇది ఇలా ఉండగా తాజాగా తన అభిమానులకు అలాగే ప్రేక్షకులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది హీరోయిన్ ఇలియానా. తాజాగా హీరోయిన్ ఇలియానా తల్లి అయింది. ఆగస్టు ఒకటో తేదీన ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది ఈ బ్యూటీ ఇలియానా.

Advertisement

అయితే ఈ విషయాన్ని తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. అంతేకాదు కోవా ఫినిక్స్ డోలన్ అనే నామకరణాన్ని తన బిడ్డకు పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం పట్ల తాను ఎంతో హ్యాపీగా ఉన్నట్లు ఇలియానా చెప్పుకొచ్చింది. అయితే తన బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయంపై ఇలియానా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి ఇలియానా తల్లి కావడంపై నెటిజన్లు, ఆయన అభిమానులు ఆమెకు అభినందనలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

“రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?

వరుస గాయాలు.. క్రికెట్ కు బుమ్రా రిటైర్మెంట్ ?

సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !

Visitors Are Also Reading