చాలా మంది ఎంతో కష్టపడి డబ్బులను సంపాదిస్తుంటారు. కొందరూ కొంచెం డబ్బు సంపాదించినా కానీ సర్దుకుని మిగిల్చుకుంటారు. మరికొందరు అయితే ఎన్ని డబ్బులు సంపాదించినా కానీ వారి ఇంట్లో డబ్బు అస్సలు ఉండదు. అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగదీస్తుంటాయి. తాను చేసే పనితో ఎటువంటి మోసాలు లేకుండా ప్రయత్నించినా వారు మాత్రం విజయం సాధించలేరు. ఎప్పుడూ వారు ఆర్థిక ఇబ్బందులతోనే సతమతమవుతుంటారు. ఎన్ని లక్షల డబ్బు వచ్చినా సరే వారి ఇంట్లో అస్సలు నిలవదు. ఆదాయానికి, ఖర్చులకు మధ్య బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వారు పేదవారిగానే మారుతారు. అటువంటి వారు ఇప్పుడు కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవడం బెటర్. వారి ఇంట్లో ప్రధానంగా మూడు మూలల ప్రభావం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఇంట్లో వాటర్ ట్యాంక్ ఈ దిశలో ఉంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటి పై కప్పు మీద ఉండే వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో ఉంచితే చాలా నష్టం జరుగుతుంది. ఈ దిశలో వాటర్ ట్యాంక్ ఉన్నట్టయితే ఆ ఇల్లు పేదరికం అనుభవించకతప్పదు. వాస్తవానికి ఆగ్నేయ దిశ అగ్ని ప్రదేశం. అగ్ని స్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడుతాయి. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో తరచూ గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తుంటాయి. వాటర్ నైరుతి దిశలో నిర్మించుకుంటే చాలా మంచిది. నైరుతి దిశ ప్రతికూల శక్తులను సమతుల్యం చేస్తుంది. ఇక వాటర్ ట్యాంక్ ను దక్షిణ దిశలో ఉంచినా మంచిదే.
Advertisement
దక్షిణ దిశలో వాటర్ ట్యాంక్ నిర్మిస్తే ట్యాంక్ స్లాబ్ కు మధ్య కనీసం ఒకటి రెండు అడుగుల ఖాళీ స్థలం ఉండేవిధంగా నిర్మించాలని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తు ప్రకారం.. మరుగుదొడ్లను ఈశాన్య దిశలో నిర్మించకూడదు. ఇలా నిర్మించడం వల్ల ఆ వ్యక్తికి డబ్బు సమస్యలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటికి ఈశాన్య దిశలో మరుగుదొడ్లు ఉంటే ఎంత కష్టపడినా ఫలితం మాత్రం బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతుంది. ఇంటికి ఉత్తరం వైపు దుమ్ము దూళి లేకుండా చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే ఆ దిశలో కుబేరుడుంటారు. కుబేరుడుండే స్థానంలో చెత్త, చెదారం వేయకూడదు. అలా వేస్తే మాత్రం పేదలుగా మిగులుతారు. అంతేకాదు.. ఇంట్లో వారు అనారోగ్యానికి కూడా గురవుతారు. ఉత్తర దిశ నుంచి వ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది. కాబట్టి ఉత్తర దిక్కులో ఎలాంటి చెత్త, చెదారం వేయకూడదు. ఉత్తర దిక్కు ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత సంపద నిలబడుతుంది. ఈ విషయాలను గుర్తుంచుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
Also Read :
ఉప్పు, పసుపు చేతికి ఇవ్వకూడదా..? ఆ రెండు వస్తువులను అప్పుగా ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
మాస్ మహారాజా రవితేజ మెగాస్టార్ చిరంజీవి సవతి తల్లి కొడుకా..? ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..!