Home » మాస్ మ‌హారాజా ర‌వితేజ మెగాస్టార్ చిరంజీవి స‌వ‌తి త‌ల్లి కొడుకా..? ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్లు..!

మాస్ మ‌హారాజా ర‌వితేజ మెగాస్టార్ చిరంజీవి స‌వ‌తి త‌ల్లి కొడుకా..? ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్లు..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత ఖైదీ నెంబ‌ర్ 150, సైరా న‌ర్సిహారెడ్డి, ఆచార్య వంటి సినిమాల త‌రువాత ప్రస్తుతం షూటింగ్ ల‌తో పుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం మ‌ల‌యాలం సూప‌ర్ హిట్ సినిమా లూసిఫ‌ర్‌కి తెలుగు రీమెక్ గా తెర‌కెక్కుతోంది గాడ్ ఫాద‌ర్‌. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా న‌టిస్తున్నాడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు త‌మిళంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన వేదాలం తెలుగు రీమేక్ గా తెర‌కెక్కుతున్న భోళా శంక‌ర్ సినిమాలో కూడా చిరంజీవి హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న త‌మ‌న్నా న‌టించనుంది.

Advertisement

ఇదిలా ఉండ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో కూడా మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక ఇప్ప‌టివ‌ర‌కు టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాకు మెగా 154 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీలో ర‌వితేజ పోషించ‌బోయే పాత్ర ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అవుతోంది. ఇందులో చిరంజీవి త‌మ్ముడిగా ర‌వితేజ క‌నిపించ‌బోఉన్నాడ‌ట‌. స‌వ‌తి త‌ల్లి కొడుకు ర‌వితేజ‌తో చిరంజీవికి వైర్యం ఏర్ప‌డుతుంద‌ట‌. ఇక వీరిద్ద‌రి పాత్ర‌ల మ‌ధ్య ఊహించ‌ని ట్విస్ట్‌లు ఉండ‌నున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది.

Advertisement

ఇప్ప‌టికే ర‌వితేజ చిరంజీవితో క‌లిసి అన్న‌య్య సినిమాలో న‌టించారు. చిరంజీవిని ర‌వితేజ సొంత అన్న‌లా భావిస్తుంటాడు. అన్న‌య్య సినిమా త‌రువాత మ‌ర‌ల ఇప్పుడు మెగాస్టార్ తో న‌టిస్తున్నాడ‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. ఇటీవ‌లే ర‌వితేజ మూవీ సెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇక ఆ స‌మ‌యంలో ఓ వీడియో కూడా విడుద‌ల చేశారు. ఈ సినిమాలో సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ సుమ‌ల‌త కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ర‌వితేజ త‌ల్లిగా సుమ‌ల‌త క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. చిరంజీవి, ర‌వితేజ ఇద్ద‌రి పాత్ర‌ల మ‌ధ్య ఊహించ‌ని ట్విస్ట్‌లు చేటు చేసుకుంటాయ‌ట‌. ఇక చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టే వార్త పై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Also Read : 

ఎన్టీఆర్ కి డూప్‌గా ఎంట్రీ ఇచ్చిన కైకాల స‌త్య‌నారాయ‌ణ‌.. బెస్ట్ విల‌న్‌గా ఎద‌గడానికి ఏం చేశాడో తెలుసా..?

ఆచార్య కోసం చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ త‌మ రెమ్యూన‌రేష‌న్‌లో ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వ‌లేద‌ట‌.. ఆ వ‌ర్గం చిరుపై ఫైర్..!

Visitors Are Also Reading