ఆచార్య చాణక్య గురించి అందరికీ తెలిసిందే. అతను చెప్పే ప్రతి విషయం జీవితంలో ఉపయోగపడేది. ఆయన చెప్పిన కొన్ని జీవిత రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా జుట్టు కత్తిరించిన వెంటనే స్నానం చేయాలి. హెయిర్ కట్ తరువాత శరీరానికి చిన్న చిన్న వెంట్రుకలు అంటుకుంటాయి. ఇలాంటి పరిస్థితిలో అసౌకర్యంగా ఉంటుంది. దీంతో పాటు వెంట్రుకలు ఆహార పదార్థాల్లో పడి మీ శరీరం లోపలికి కూడా ప్రవేశించవచ్చు.
అతి సర్వత్రా వర్ణియేత్ అని ఆచార్య చెప్పేవారట. ఎవరైనా ముక్కు సూటిగా ఉండడం కూడా మంచిది కాదు. ఎందుకంటే నిదానంగా పెరిగే చెట్లనే మొదట నరికేస్తారు. అదేవిధంగా సూటిగా ఉండే వ్యక్తికి అందరూ శత్రువులుగా మారతారు. అందుకే ప్రతి వ్యక్తి తనను తాను రక్షించకునేంత వేగంగా ఆలోచనలు చేస్తుండాలని సూచించారు.
Advertisement
Advertisement
చాణిక్యుడు కోప స్వభావం గురించి కూడా చెప్పారు. కోపంతో ఉన్నవారు ముఖ్యంగా తప్పులు చేస్తారట. ఆ తర్వాత దాన్ని భారాన్ని భరిస్తారు. ఒక్కోసారి వారికి హాని కలిగిస్తుంది. వ్యక్తికి ఆశ తగదని.. శ్వాస గల వ్యక్తి తన మనస్సును ఎప్పటికీ సంతృప్తి పరచలేడు. ఎల్లప్పుడూ కలత చెందుతున్నాడు. తప్పుడు అడుగులు కూడా వేసే అవకాశం ఉంటుంది.
మీరు జీవితంలో ముందుకు వెళ్లాలనుకుంటే తొలుత ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఆ లక్ష్యానికి తగిన వ్యూహాన్ని రూపొందించుకోండి. ఆ తర్వాత పూర్తి శ్రమతో ఆ లక్ష్యం వైపు పయనించండి. కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్న వారే ఎటువంటి లక్ష్యాన్నైనా చేదిస్తారు. కొంతమంది కొన్ని పనులను పూర్తి చేయడానికి అబద్ధాల మీద ఆధారపడుతుంటారు. అబద్ధం చెప్పడం ద్వారా ఈ రోజు మీ పని ఏదో ఒక విధంగా పూర్తి కావచ్చు. కానీ మీ అబద్ధం దొరికిన రోజు నీ మీద విశ్వాసంతో పాటు గౌరవాన్ని కూడా మీరు కోల్పోతారు.
Also Read :
బొప్పాయి పండును ఈ సీజన్‌లో తప్పకుండా తినాలి.. ఎందుకో తెలుసా..?