మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4డిగ్రీల ఫారం హీట్ ఉంటుంది.ఇక ఇంతకంటే ఎక్కువ ఉంటే జ్వరం ఉన్నట్లే లెక్క. ఒకవేళ శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 106° ఫారన్హీట్ పెరిగితే వడదెబ్బ తాకినట్లే. ప్రస్తుతం వింటర్ సీజన్ కంప్లీట్ అయింది. భానుడు భగభగమంటున్నాడు. సాధారణంగా ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చెట్లకు కొత్త చిగురు వస్తూ ఉంటుంది. చెట్లన్ని పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. ఈ టైంలో నెమ్మదిగా వేడి కూడా పెరుగుతుంది. అయితే ఈసారి మార్చి మొదలవుతూనే వేడి వాతావరణం వెంటబెట్టుకొచ్చింది. మొదటి వారం ముగిసిందో లేదో అప్పుడే సూర్యుడు భగభగమంటున్నాడు.
Advertisement
Also Read; ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆ దర్శకుడు ఎలా చనిపోయాడో తెలుసా ?
ఇప్పటికే ప్రభుత్వం జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేసింది. ఈ టైంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎండలో కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఉంటే మాత్రం శరీరం అదుపుతప్పుతుంది. మరి ఎండాకాలంలో వడదెబ్బ గురైనప్పుడు కనిపించే లక్షణాలు ఏంటో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..దేశంలో ఉష్ణ శక్తి పెరుగుతోంది. ఈ సందర్భంలో వడదెబ్బపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో అసలు వడదెబ్బ గురైనప్పుడు కలిగే సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వడదెబ్బ అనేది యాక్సిడెంట్ లాంటిది..
Advertisement
Also Read; ఈ 4 అలవాట్లు అబ్బాయిలో ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారట…3వది ఇంపార్టెంట్.!
అనుకోకుండా వస్తుంది. దీని వల్ల శరీరంలో నీటి శాతం కోల్పోయి చెమట పట్టడం నిలిచిపోతుంది. నాడి వేగం పెరుగుతుంది. కళ్ళు మసకబారుతాయి. నీరసంగా ఉంటుంది. తలనొప్పి వస్తుంది వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటే వాంతులు, విరోచనాలు, కూడా అవుతాయి. దాహం ఎక్కువగా ఉంటుంది. తల తిరగడం, మతి కోల్పోవడం అంటే లక్షణాలు కూడా కనిపిస్తాయి. వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటే వాంతులు, విరేచనాలు వంటివి ఏర్పడతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు చర్యలు తీసుకోకపోతే త్వరగా వడదెబ్బ గురవుతారు. కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయి.