సాధారణంగా ప్రతి ఒక్కరి ఇండ్లలో బల్లులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక వీటిని చూసి కొన్ని సందర్భాల్లో చాలామం
If you see a lizard, do you know what it is a sign of
ది భయపడుతుంటారు. కానీ వాస్తవానికి హిందూ సాంప్రదాయ ప్రకారం.. బల్లులకు కూడా శేషమైన స్థానం ఉన్నది. బల్లులు మీద పడడం వల్ల కొన్ని సందర్భాల్లో మంచి, మరికొన్ని సందర్భాల్లో చెడు కూడా సూచిస్తుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. బల్లులు ఇండ్లలోని కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తే మంచిదేనట. ఇక ఆలయంలో లేదా దేవుని గుడిలో బల్లి కనిపించినట్టయితే ధనం, సంతోషాన్ని ఇస్తుందట. అంతేకాదు ఇంట్లో వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలకు చిహ్నమట.
Advertisement
ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుందని వేదపండితులు పేర్కొంటున్నారు. భవిష్యత్ లో ఎదురయ్యే కొన్ని సంఘటనలను కూడా బల్లులు సూచిస్తాయట. దీపావళి రోజు ఇంట్లో బల్లి కనిపిస్తే శుభ సూచకం. బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుంది అంటుంటారు. దీపావళి రోజు బల్లి కనిపిస్తే త్వరలోనే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతుంటారు. కానీ బల్లులు ఇంట్లో కొట్లాడుకుంటే.. బల్లి చనిపోతే ఎదురయ్యే సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాం.
Advertisement
Also Read : రంగనాథ్ చనిపోవడానికి ముందు గోడపై ఏం రాశారో తెలుసా ?
కొత్తగా ఇంట్లోకి వచ్చే వారికి బల్లులు కనిపించినట్టయితే మన పూర్వీకుల రాకను లేదా తండ్రి రాకను సూచిస్తుందట. అదేవిధంగా ఆ సమయంలో పూర్వీకులు బల్లి రూపంలో వచ్చి దీవిస్తారని నమ్ముతుంటారు. ఇంట్లోకి వచ్చే సమయంలో బల్లులు చనిపోతాయి. చనిపోయి కానీ.. పూడ్చిపెట్టిన బల్లి గాని కనిపించినట్లయితే అశుభమని నమ్ముతుంటారు. బల్లులు పొట్లాడుకుంటే చూడడం అస్సలు మంచిది కాదట. కలలో మీరు బల్లిని పట్టుకోవాలని ప్రయత్నించినట్టయితే.. అది పారిపోతే మంచిదని నమ్ముతుంటారు. ముఖ్యంగా రెండు బల్లులు పొట్లాడుకుంటుంటే అసలు చూడకూడదట. అలా చూస్తే అశుభాలు కలుగుతాయని నమ్మకం. ఇంట్లో బల్లులు కొట్లాడుకుంటుంటే ఆ ఇంట్లోని వ్యక్తుల మధ్య కూడా మనస్పార్ధాలు పెరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.