Home » రంగనాథ్ చనిపోవడానికి ముందు గోడపై ఏం రాశారో తెలుసా ?

రంగనాథ్ చనిపోవడానికి ముందు గోడపై ఏం రాశారో తెలుసా ?

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే ఇండస్ట్రీలోకి వస్తుంటారు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి చాలా తక్కువ మంది మాత్రమే వస్తుంటారు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో సీనియర్ నటుడు రంగనాథ్ ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు గారి నటన చూసి.. రంగనాథ్ నటన పై ఆసక్తి పెంచుకున్నారు. ఓవైపు కుటుంబాన్ని పోషించుకుంటూనే.. మరోవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. పుట్టింది మద్రాసులోనే కావడంతో సినిమా వాళ్ళను కలిసి అవకాశం కోసం ప్రయత్నించడం పెద్ద కష్టంగా ఏమీ అనిపించలేదు. పెద్ద హీరో గా మారే అవకాశాలు కూడా కూలంకుషంగా ఉన్నప్పటికీ..  ఆర్థిక పరిస్థితి కారణంగా ఆయన పూర్తిగా సినిమాల మీదనే దృష్టి పెట్టలేకపోయారు. కుటుంబ బాధ్యతల కోసం టికెట్ కలెక్టర్ గా పని చేసేవారు రంగనాథ్. 

Advertisement

ఓసారి సినిమా మా ప్రయత్నాల్లో భాగంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దాదాపు 300 సినిమాలలో నటించారు. టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. అంతటి అద్భుతమైన వ్యక్తి 66 ఏళ్ల వయస్సులో  చనిపోవడం వెనక ఆంతర్యం ఏమిటనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా 2009లో ఆయన భార్య చనిపోయారు. ఆయన ఒంటరిగానే ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్లి  2015 లో  తిరిగిరాని లోకాలకు వెళ్లారు. రంగనాథ్ కి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నాడు. వాస్తవానికి రంగనాథ్ చనిపోవడానికి కంటే ముందు వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఓ టాపిక్ గురించి మాట్లాడే వారట. దీంతో రంగనాథ్ కూతురు నీరజ ఓ సైకాలజిస్ట్ వద్దకు కూడా తీసుకెళ్లారట. కానీ వాళ్లు మాత్రం రంగనాథ్ తో ఎక్కువగా కలిసి ఉండేవారు కాదట. 

Advertisement

Also Read :  ఖడ్గం సినిమా కోసం చార్మినార్ వీధుల్లో షఫీ ఏం చేశాడో తెలుసా..?

Manam News

హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ వారు ప్రత్యేకంగా వేరే ఇంట్లో ఉండడంతో రంగనాథ్ ఓ పని మనిషితో వంట చేయించుకొని ఒక్కడే ఉండే వారట. రంగనాథ్ కి సేవ చేసిన ఆ పనిమనిషి పేరు మీనాక్షి. రంగనాథ్ చనిపోవడానికంటే ముందు గోడమీద ఓ బ్లాకు మార్కర్ తో పని మనిషి  మీనాక్షికి ఫలానా ఆస్తి ఇచ్చేయండి అని..  తనను ఇబ్బంది పెట్టకండి రాశారట. అసలు రంగనాథ్ ఎందుకు అలా చేశారో వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. మరోవైపు చివరి రోజుల్లో తనను బాగా చూసుకున్న పనిమనిషి మీనాక్షికి డబ్బు ఇవ్వండి అని చెప్పి ఉండవచ్చని భావిస్తున్నారు. మొత్తానికి చనిపోవడానికి ముందు పనిమనిషి గురించి ఆలోచించిన రంగనాథ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read :   వాల్తేరు వీరయ్య ట్రైల‌ర్ చూడగానే మీకూ ఇదే డౌట్ వ‌చ్చిందా..? అంటే దానికి అర్థం..!

Visitors Are Also Reading