Home » ఎంత పెద్ద దోషం ఉన్నా ఈ చెట్టు ఆకులో దీపం పెడితే తొలగిపోతుందట.!!

ఎంత పెద్ద దోషం ఉన్నా ఈ చెట్టు ఆకులో దీపం పెడితే తొలగిపోతుందట.!!

by Sravanthi Pandrala Pandrala
Ad

రావి చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకొని ఉంటుంది. శాపాలు, దోషాలు,పూర్వజన్మ కర్మ లను ఈ రావిచెట్టు తొలగించగలదు. అందుకు చేయవలసిన పని ఏమిటంటే దాన్ని పూజించడమే. అంతే కాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను దేవుని మందిరం లో పెట్టి దానిపై దీపం వెలిగిస్తూ ఉంటే శాప దోష కర్మ ఫలితాలు పోతాయి. రావి చెట్టు ఆకులను తీసుకువచ్చి దానిపై ప్రమిదలను ఉంచి, నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి.

Advertisement

శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహు కేతు దోషాలు, నవగ్రహ దోషాలు వంటివి తొలిగిపోతాయి. సోమవారం రోజు జన్మించిన వారు రావి ఆకులు మూడింటి పై నువ్వుల నూనెతో ప్రమిదలు ద్వారా దీపం వెలిగించాలి. మంగళవారం జన్మించిన వారు రెండు దీపాలు, బుధవారం జన్మించిన జాతకులైతే మూడు దీపాలు, గురువారం జన్మించిన వారు ఐదు దీపాలు, శుక్రవారం జన్మించిన వారు 6 దీపాలు, శనివారం జన్మించినవారైతే తొమ్మిది దీపాలు, ఆదివారం జన్మించిన వారు 12 రావి ఆకులపై ప్రమిదలను పెట్టి దీపాలు వెలిగించాలి.

Advertisement

రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాలవైపు ఉండేలా ఆకు చివరిభాగం మనల్ని చూసే విధంగా ఉంచి దీపాన్ని వెలిగించాలి. అలా చేశాక దీపం ముందు కూర్చుని చేసిన పాపాలన్ని తొలగి పోవాలని ప్రార్థించాలి. ఇలా చేస్తే దోషాలన్ని తొలగి పోయి శుభ ఫలితాలు కలుగుతాయి. రావి చెట్టును పూజిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయి. ఇంట్లో రావి చెట్టు ఆకులనుంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు ఉండవు. రావి చెట్టు ఆకులను తీసుకువచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి.

also read;

‘అఖండ’ అరుదైన రికార్డు.. దేశంలోనే ఈ ఫీట్ అందుకున్న హీరో బాల‌య్య‌..!

ఈ అల్లం పేస్టుతో జాగ్రత్త.. తిన్నారంటే పేగులు ఖతం..?

 

Visitors Are Also Reading