రాజమౌళి అంటేనే ఓ బ్రాండ్ మాదిరిగా మారింది ఇప్పుడు. ఆయన ఏ సినిమా తీసినా.. అందులో హీరో ఎవరైనా సరే ఆ సినిమా హిట్ అనే రీతిలో ట్రెండ్ నడుస్తోంది. తాజాగా మల్టీస్టారర్ మూవీ అయినా ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ అగ్రహీరోలతో సినిమా తీసి మరొక విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు రాజమౌళి. రాజమౌళి ఏబీఎన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ రాజమౌళిని పలు ప్రశ్నలు సంధించాడు. దానికి రాజమౌళి ఈ విధంగా సమాధానం చెప్పాడు. తాను రాఘవేంద్రరావు వద్ద శిష్యరికం చేశాను. అతను ఛాన్స్ ఇచ్చినప్పుడు పూర్తి స్థాయిలో కష్టపడ్డాను అని చెప్పాడు. సినిమా అవకాశం ఎలా వచ్చిందని ప్రశ్నించగా..? రాజమౌళి ఈ విధంగా సమాధానం చెప్పాను. నేను సినిమా తీస్తానని అసలు ఊహించలేదు. అప్పటివరకు యాడ్స్, సీరియల్స్ తీశాను. అకస్మాత్తుగా మా గురువు రాఘవేంద్రరావు వద్దకు స్టూడెంట్ నెం.1 కథ వచ్చింది. అప్పుడు రాఘవేంద్రరావు నాకు అప్పగించాడు. అంతకు ముందు రాజమౌళి ఏ పని చెప్పినా బాగా చేస్తాడనే పేరు వచ్చింది.
Advertisement
మీ సినిమా విడుదలయ్యేటప్పుడు మీరు ఏ విధంగా ఫీలవుతారనగా.. ప్రతీ సినిమా విడుదలయ్యేటప్పుడు టెన్షన్ గా ఫీల్ అవుతాను. అదేవిధంగా నీ సక్సెస్‌కు కారణం ఏమిటి అని ప్రశ్నించగా..? నేను కాన్సెప్ట్ ఏదైతే అనుకుంటానో అదే తెరమీదకు తీసుకొస్తాను. కొన్నిసార్లు అది కుదరదు. అయినా రాజీ పడకుండా తీసుకురావడమే విజయానికి ప్రధాన కారణం అని చెప్పాడు రాజమౌళి. అదేవిధంగా పలు సినిమాలను కాపీ కొట్టినట్టు కూడా రాజమౌళి ఒప్పుకున్నాడు. పలువురు కూడా పాటలను సినిమా సీన్లను కాఫీ కొట్టారని వివరించారు. టీడీపీ యాడ్స్ చేసేవారట. ముఖ్యంగా శాంతి నివాసం సినిమా సమయంలోనే రాజమౌళికి ఎక్కువగా గుర్తింపు వచ్చింది.
Advertisement
Also Read : వీలునామా ని రాసేటప్పుడు ఈ తప్పులు చేస్తే అవి చిత్తు కాగితంతో సమానం అని మీకు తెలుసా..?
కానీ రాజమౌళి శాంతి నివాసం సినిమా పరమచెత్త అని చెప్పారు. తొలుత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ ను చూసి వీడితోనా నా మొదటి సినిమా అని అసహించుకున్నాడటా. అప్పటి నుంచి ఎన్టీఆర్-రాజమౌళి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచే కథలు చెప్పడం అలవాటు అని రాజమౌళి చెప్పాడు. తొలుత రాజమౌళి తాత గారికి 300 ఎకరాల ఆస్తీ ఉండేదట. అది కాల క్రమేణా కరిగిపోయిందట. సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారని ప్రశ్నించగా.. నాన్న దగ్గర ఎస్కేప్ అవ్వడానికి సినిమా ఇండస్ట్రీలో ఎడిటింగ్‌లో చేరాను. క్రాంతి కుమార్ అసిస్టెంట్ గా డైరెక్టర్‌గా చేశాను. కొన్ని సందర్భాలలో నాన్న ద్వారా బీ.గోపాల్ కు కొన్ని యాక్షన్ సీన్లు వివరించాను. కానీ అవి సినిమాల్లో రాలేదు. దీంతో మనమే సినిమా తీస్తే బాగుంటుందని సినీ రంగంలోకి ప్రవేశించాడట.
అలా స్టూడెంట్ నెం.1 సినిమాతో తన ప్రస్థానం ప్రారంభమైంది. నా సినిమాల్లో ఎక్కువగా విలన్ బలంగా ఉండేవిధంగా చూస్తాను. విలన్ పవర్‌పుల్ గా ఉంటే యాక్షన్ సీన్లు పండుతాయి. ప్రేక్షకులకు అన్ని రకాలుగా అందిస్తాను. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా అన్ని విధాలుగా తీస్తానని చెప్పాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో మల్టీస్టారర్ సినిమా తీస్తారా అని ప్రశ్నించగా అప్పుడు రాజమౌళి తీయను అని.. తీసినా అభిమానులను సంతృప్తిపరచలేమని చెప్పారు. కానీ ప్రస్తుతం వారిద్దరితో ఆర్ఆర్ఆర్ సినిమా తీసి విజయం సాధించాడు జక్కన్న. 2010లో రాజమౌళి ఏబీఎన్ ఇంటర్వ్యూ ఇప్పుడూ నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Also Read : అభిమానుల అంచనా ప్రకారమే హీరోలు ఉండాలా..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై గరికపాటి ఫైర్..!