Home » పవన్ కళ్యాణ్ సినిమాను రష్మిక ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

పవన్ కళ్యాణ్ సినిమాను రష్మిక ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా టాలీవుడ్ ఎంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ వారిలో కొందరూ మాత్రమే స్టార్ హీరోయిన్లుగా తమ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఒకరూ. సాదా సీదాగానే ఛలో మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ బ్యూటీ. అదిరిపోయే అందం, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తరువాత గీతా గోవిందం మూవీతో కుర్రకారును ఆకట్టుకొని.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఛాన్స్ కొట్టేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా తన క్రేజ్ సంపాదించుకుంది.

Advertisement

ఇక ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,  సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీలో నటించింది. పాన్ ఇండియా మూవీ ద్వారా రష్మిక తన క్రేజ్ ని దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేవిధంగా చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఈమెకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమితాబచ్చన్ తో ఓ మూవీలో కూడా నటించింది. తాజాగా రష్మిక మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ వీడిపై పలువురు  సినీ, రాజకీయ ప్రముఖులు సైతం సీరియస్ గా స్పందించారు. ఈ నేపథ్యంలో రష్మిక గురించి ఓ ఇంట్రెస్టింగ్ వైరల్ గా మారింది. అదేంటి అంటే.. ఈమె పవన్ కళ్యాణ్ తో కూడా నటించే అవకాశం వస్తే.. ఈ సినిమాని వదులుకుందట.

Advertisement

ఇక ఈ సినిమా మరేదో కాదండోయ్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్. ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కంప్లీట్ గా మెసెజ్ ఓరియంటెడ్ సినిమా కావడంతో ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలుండవు. అప్పుడప్పుడే హీరోయిన్ గా పేరు సంపాదించుకుంటున్న రష్మికకు ఈ సినిమాలో నివేదా థామస్ స్థానంలో నటించే అవకాశం వచ్చిందట. కానీ ఇలాంటి పాత్రల్లో నటిస్తే.. గ్లామరస్ బ్యూటీగా ఇక ఇండస్ట్రీలో ఉండనేమోనని ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. 

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి.     తెలుగు న్యూస్ కోసం వీటిని వీక్షించండి.

Visitors Are Also Reading