రచయిత కెరీర్ ప్రారంభించి అనూహ్యంగా డైరెక్షన్ విభాగంలోకి అడుగుపెట్టి, వరుస హిట్స్ తో టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటేడ్ దర్శకునిగా మంచి పేరు సంపాదించుకున్నారు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి చిత్రాలతో హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించారు. కానీ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించిన ఆచార్య సినిమా మాత్రం కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి. బీటెక్ చదివి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కొరటాల శివలో మంచి రచయిత ఉన్నాడు. సాధారణంగా కథనే సినిమా సక్సెస్ కి కారణం అని నమ్మే కొరటాల శివ రచయిత కన్నా డైరెక్టర్లకు ఎక్కువగా గుర్తింపు ఉంటుందని నమ్మి.. ఆ దిశగా అడుగు వేసి తన సత్తా చాటుతున్నాడు.
Advertisement
కొరటాల సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకోవడానికి తన భార్య కారణమని చాలా సందర్భాల్లో కొరటా శివ చెప్పుకొచ్చారు. ప్రతీ పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు కదా.. అలాగే శివ వెనుక ఉన్న స్త్రీ ఆయన భార్య అరవింద. ఆమె చాలా సింపుల్ గా ఉంటారు. అయితే ఆమె లండన్ లో ఉన్నత విద్యనభ్యసించారు. కొరటాల శివ నిజాయితీ ఆమెను కట్టి పడేయడంతో వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అన్ని బాగానే ఉన్నప్పటికీ పాపం వీరికి మాత్రం ఇప్పటివరకు పిల్లలు కలుగలేదు. అయితే సమాజంలో గల చిన్నపిల్లలందరూ తమ పిల్లలనే భావన కలిగిన ఆమె ఆ దివగా కొరటాలను ప్రోత్సహించింది.
Advertisement
Also Read : టెంపర్ క్లైమాక్స్ విని దర్శకుడు పూరి జగన్నాథ్ ఏం చేశాడో తెలుసా ?
ఇద్దరు బతకాలంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉంటే చాలన్నది అరవింద ఫిలాసఫీ. పైగా ఆమె రామకృష్ణ పరమహంస భక్తురాలు. ప్రతీ ఆదివారం రోజు ఆమె రామకృష్ణ మఠానికి వెళ్లి సేవలు అందిస్తుంది. శ్రీమంతుడు కాన్సెప్ట్ ఆమె ఫిలాసఫీ నుంచి వచ్చిందే అట. కోట్లు సంపాదించినా నేటికి చిన్న అపార్ట్ మెంట్ లోనే ఉంటున్నారు. ఎంత సంపాదించినా అవసరానికి మించి ఉండకూడదని, తినడానికి, బతకడానికి అవసరమైంది ఉంచుకుని మిగిలింది తిరిగి సమాజానికి ఇచ్చేయాలని ఆమె సిద్ధాంతం. అందుకోసమే సంపాదనలో అధిక భాగం సమాజ సేవకే కేటాయిస్తారట అరవింద. మరోవైపు దర్శకుడి జీవితం కన్నా ఓ మంచి వ్యక్తికి భర్తగా జీవితమే చాలా బాగుంటుందని కొరటాల శివ చాలా సందర్బాల్లో భార్య అరవింద గురించి చెప్పుకొచ్చారు.
Also Read : వాళ్ళందరి వెంటపడి చివరికి నా దగ్గరకు వచ్చాడు.. చైతూ పై సమంత కామెంట్స్ వైరల్…!