టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రెబల్ స్టార్ గా ఎదిగి తనదైన ముద్ర వేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3.16 గంటలకు తుదిశ్వాస విడిచారు. నటుడిగా, నిర్మాతగా, కేంద్ర మంత్రిగా ఆయన అనేక బాధ్యతలను నిర్వర్తించారు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు కావడంతో తన తమ్ముడి కుమారుడు అయినటువంటి ప్రభాస్ ని తన కొడుకులా భావించేవారు. ప్రభాస్ కెరీర్ ను తీర్చిదిద్దడంలో ఆయనది కీలక పాత్ర అనే చెప్పాలి. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో క్షత్రియ వంశంలో జన్మించిన కృష్ణంరాజుది సంపన్న కుటుంబం. పెద్ద మొత్తంలో ఆస్తులున్నాయి.
Advertisement
ముఖ్యంగా 2009లో లోక్‌సభ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణంరాజు ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 2009 నాటికి ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.8.62 కోట్లు ఉండగా.. రూ.2.14 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. కృష్ణంరాజు వద్ద రూ.5.28 లక్షల విలువైన బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. దాదాపు రూ.20లక్షల విలువైన బాండ్లు ఉండగా.. ఆయన భార్య, ముగ్గురు పిల్లల పేరిట ఉన్న బాండ్లు కూడా కలిపితే వాటి విలువ రూ.62లక్షలు దాటింది. తన పేరిట రూ.8లక్షల ఇన్నోవా కారు, రూ.5.80 లక్షల విలువైన స్విప్ట్‌కారు, తన భార్య పేరిట వెర్నా, హ్యుందాయ్ ఐ 10 కార్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : PRABHAS WITH KRISHNAM RAJU: ప్రభాస్ ఆ సినిమా చేస్తే చూడాలని ఉందన్న కృష్ణంరాజు
ఇక బంగారం విషయానికి వస్తే.. కృష్ణంరాజు వద్ద 754 గ్రాముల బంగారం, ఆయన భార్య దగ్గర 1690 గ్రాముల బంగారం, ముగ్గురు పిల్లల వద్ద వరుసగా 547.24 గ్రాములు, 549.58 గ్రాములు, 569.24 గ్రాముల చొప్పున బంగారం ఉంది. 2009 నాటికి ఈ విలువ రూ. 43 లక్షలు. మొత్తం బంగారం 4 కిలోల పైమాటే కాగా.. ప్రస్తుత మార్కెట్ ప్రకారం.. బంగారం విలువ రూ.1.8 కోట్లకు పైనే అన్నట్టు. 2009 నాటికి కృష్ణంరాజు కుటుంబం వద్ద ఉన్న మొత్తం చరాస్తుల విలువ రూ.1.39 కోట్లు అని మై నేత. ఇన్ఫో వెల్లడించింది.
ఇది కూడా చదవండి : KRISHNAM RAJU : పైరసీకి బలైన మొదటి సినిమా కృష్ణంరాజుదే అనే విషయం మీకు తెలుసా..?
Advertisement
స్థిరాస్తుల విషయానికి వస్తే.. మొగల్తూరులో కృష్ణంరాజు పేరు మీద ఉన్న 9.50 ఎకరాలు, 1.2 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి ఉంది. అక్కడి సమీపంలోని రామన్నపాలెంలో 5 సెంట్ల వ్యవసాయేతర భూమి, అల్లాపూర్ లో 860 చదరపు గజాల స్థలంఉందని పేర్కొన్నారు. 2009 నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఈ భూముల విలువ రూ.45లక్షలు. మొగల్తూరులోని గాంధీ విగ్రహం సెంటర్ లో కృష్ణంరాజు పేరిట ఓ షాపింగ్ కాంప్లెక్స్, 6 సెంట్ల స్థలం, మొగల్తూరులో 12 సెంట్ల స్థలంలో 1994 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ ఇల్లు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. వీటి విలువ దాదాపు రూ.42లక్షలు. 2009 నాటికి కృష్ణంరాజు పేరిట రూ.1.08 కోట్ల విలువైన స్థిరాస్థులున్నాయి. ఇక కృష్ణంరాజు సతీమణి పేరిట ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో 1.81 ఎకరాలు, 1.61, 0.34 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూమి ఉంది. రామన్నపాలెంలో 1.5 ఎకరాలు, 0.30 ఎకరాలలో పొలం ఉంది. కోటవురట్ల సమీపంలో 6.46 ఎకరాలు, 4.07 ఎకరాల విస్తీర్ణంలో మామిడితోట, విజయవాడ సమీపంలో గన్నవరంలో 0.70 సెంట్ల భూమి ఉంది.
ఇది కూడా చదవండి : KRISHNAM RAJU : తనకు తానే శిక్ష వేసుకున్న రెబల్ స్టార్.. ఎందుకో తెలుసా..?.. ఎందుకో తెలుసా..?
హైదబాద్ కూకట్ పల్లి అల్లాపూర్‌లో 823 గజాలు, 500 గజాల స్థలాలు, విశాఖ సమీపంలో భీమునిపట్నంలో 1111.11 గజాల స్థలం ఉంది. జూబ్లీహిల్స్ 491.5 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇల్లు, చెన్నైలోని సైదాపేటలో 3830 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. వీటన్నింటి విలువ రూ.6.12 కోట్లు కాగా.. ఆమె పేరిట రూ.2.14 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. కృష్ణంరాజు ఇద్దరు కూతుర్ల పేరు మీద శంషాబాద్ సమీపంలో 200 గజాల చొప్పున స్థలం ఉంది. వీట్నింటినీ కలిపితే కృష్ణంరాజు కుటుంబ ఆస్తులు రూ.7.23 కోట్లు ఉండగా.. అప్పులు రూ.214 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం.. వీటి విలువ ఎక్కువగానే ఉండే అవకాశముంది. కృష్ణంరాజు కుటుంబానికి దాదాపు రూ.800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు సమాచారం.
ఇది కూడా చదవండి : KRISHNAM RAJU DEATH : కృష్ణంరాజు మరణానికి కారణాలు ఇవే.. ఏఐజీ డాక్టర్లు ఏమన్నారంటే..?