Home » KRISHNAM RAJU : త‌న‌కు తానే శిక్ష వేసుకున్న రెబ‌ల్ స్టార్.. ఎందుకో తెలుసా..?

KRISHNAM RAJU : త‌న‌కు తానే శిక్ష వేసుకున్న రెబ‌ల్ స్టార్.. ఎందుకో తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ముఖ్యంగా పౌరానికాల్లో ఎన్టీఆర్, సాంఘికాల్లో ఏఎన్నార్, అభిన‌యం అంటే కృష్ణంరాజుకు ఎంతో అభిమానం. ఎన్టీఆర్ ని శ్రీ‌కృష్ణుడిగా చూడ‌డం అంటే ఆయ‌న‌కు చాలా ఇష్ట‌మ‌ట‌. అలాంటి న‌ట‌ర‌త్న ఎన్టీఆర్ ని కృష్ణంరాజు మొద‌టిసారి క‌లుసుకున్న‌ది ఆయ‌న కృష్ణుడి గెట‌ప్ లో ఉన్న స‌మ‌యంలోనే.. శ్రీ‌కృష్ణ‌తులాభారం సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడి వేషంలో ఉండ‌గా ఆయ‌న‌ను తొలిసారి క‌లుసుకున్నారు కృష్ణంరాజు.


ఇక ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ త‌న‌పై చూపిన ఆప్యాయ‌త‌ను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ ముఖ్యంగా కృష్ణంరాజుకు త‌గ్గ పాత్ర‌లు త‌న చిత్రాల్లో ఏమైనా ఉంటే త‌ప్ప‌కుండా ఇప్పించేవారు. ముఖ్యంగా సినిమాల‌పై ఆస‌క్తితో ఇంట్లో కూడా ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా చెన్నైచేరుకున్న కృష్ణంరాజు 1966లో చిల‌క గోరింక సినిమాతో నటుడిగా వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఇక ఆ సినిమా మాత్రం ఆశించిన ఫ‌లితం దక్క‌లేదు. ఇందుకు కార‌ణం కాద‌ని మిత్రులు, ద‌ర్శ‌క నిర్మాత‌లు చెప్పినా సంతృప్తి చెంద‌లేదు. న‌టుడిగా రాటుదేలేందుకు అనేక పుస్త‌కాలు, ప్ర‌ముఖ న‌టుడు నారాయ‌ణ‌రావు వ‌ద్ద శిక్ష‌ణ తీసుకున్నాడు.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  KRISHNAM RAJU DEATH : కృష్ణంరాజు మ‌ర‌ణానికి కార‌ణాలు ఇవే.. ఏఐజీ డాక్ట‌ర్లు ఏమ‌న్నారంటే..?

ఇక ఆ స‌మ‌యంలో ఎన్ని సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ కొంత కాలం వ‌ర‌కు సినిమాల‌కు దూరంగా ఉంటూ త‌న‌కు తానే శిక్ష విధించుకున్నాడు కృష్ణంరాజు. ముఖ్యంగా ఏఎన్నార్ న‌టించిన దేవ‌దాస్ చిత్రం అంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టం. ఆ సినిమాను ఎక్కువ‌సార్లు చూశాన‌ని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. కృష్ణంరాజులోని న‌టుడిని ఏఎన్నార్ సైతం ప్రోత్స‌హించారు. ఏఎన్నార్ తో క‌లిసి కృష్ణంరాజు బుద్ధిమంతుడు, జై జ‌వాన్‌, రైతుకుటుంబం, ప‌విత్ర‌బంధం, మంచి రోజులు వ‌చ్చాయి, క‌న్న కొడుకు, ఎస్.పీ.భ‌యంక‌ర్ వంటి చిత్రాల్లో న‌టించారు. కృష్ణంరాజు, చిరంజీవిది ఒకే ఊరు కావ‌డంతో తొలుత చిరంజీవిని కృష్ణంరాజు ప్రోత్స‌హించారు. తాను న‌టించి నిర్మించిన మ‌న‌వూరి పాండ‌వులు చిత్రంలో చిరంజీవికి కీల‌క‌మైన పాత్ర‌ను ఇచ్చారు కృష్ణంరాజు.

ఇది కూడా చ‌ద‌వండి :  KRISHNAM RAJU : పైరసీకి బ‌లైన మొద‌టి సినిమా కృష్ణంరాజుదే అనే విష‌యం మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading