Home » ‘లియో’ సినిమాలో యాక్టర్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

‘లియో’ సినిమాలో యాక్టర్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు లియో. తమిళ స్టార్ హీరో విజయ్.. ఈ చిత్రంలో హీరోగా నటించిన విషయం విధితమే. దసరా పండుగ కానుకగా ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల రెమ్యునరేషన్ కి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏ సెలబ్రిటీ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

 

బడ్జెట్ పరంగా రూ.300 కోట్ల వరకు లియో మూవీ కోసం ఖర్చు చేశారు. ఇందులో సగం బడ్జెట్ చిత్ర బృందం రెమ్యునరేషన్ కోసమే ఖర్చు చేసినట్టు సమాచారం. ఎందుకు అంటే..? ఈ చిత్రానికి కేవలం హీరో విజయ్ దళపతి ఒక్కడే రూ.120 కోట్లు పారితోషికం తీసుకున్నాడట. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూ.8కోట్లు.. సంగీత దర్శకుడు రూ.10 కోట్లు.. సంజయ్ దత్.. రూ.8కోట్లు.. త్రిష రూ.5కోట్లు.. అర్జున్ రూ.1కోటి, ప్రియా ఆనంద్ రూ.50 లక్షల వరకు పారితోషికం తీసుకున్నారట. మరోవైపు సహాయ పాత్రల్లో నటించిన గౌతమ్ మేనన్, మిస్కిన్ తదితరులు రూ.30-50 లక్షల మధ్య రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ప్రస్తుతం రెమ్యునరేషన్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాల తెగ వైరల్ అవ్వడంతో.. వామ్మో.. హీరో విజయ్ ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడా అంటూ  నెటిజన్లు అభిమానులు షాక్ అవుతున్నారు. ఇకపోతే దసరా బరిలో ఉన్న మరో రెండు సినిమాల విషయానికి వస్తే.. ఒకటి బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి మూవీ కాగా.. మరో మూవీ మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర్ రావు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు ఓటీటీలో థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఈ మూడింట్లో ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్న చిత్రం లియోనేే కావడం విశేషం. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకు మెప్పింస్తుందో చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

చిన్నా మూవీలో నటించిన ఈ పాప ఎవరు..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!

‘లియో’ టైటిల్‌ కోసం నాగవంశీ ఎన్ని లక్షలు ఖర్చు చేశారో తెలుసా ?

Visitors Are Also Reading