Home » చిన్నా మూవీలో నటించిన ఈ పాప ఎవరు..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!

చిన్నా మూవీలో నటించిన ఈ పాప ఎవరు..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!

by Anji
Ad

హీరో సిద్దార్థ్ హీరోగా నటించిన చిత్రం చిన్నా. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల గుండెలను పిండేసిందనే చెప్పాలి. తెలుగులో కూడా రీసెంట్ గా విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. గడిచిన దశాబ్ద కాలంగా సిద్దార్థ్  నుంచి ఇంత గొప్ప సినిమా రాలేదనే చెప్పవచ్చు. నటన పరంగా కూడా ఈ చిత్రం సిద్దార్థ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

Advertisement

ఇక ఈ సినిమాలో ఆయన కేవలం నటించడం మాత్రమే కాకుండా.. నిర్మాతగా కూడా వ్యవహరించాడు. చైల్డ్ అబ్యూజ్ అనే హార్ట్ హిట్టింగ్ కాన్సెప్ట్ తో దర్శకుడు అరుణ్ కుమార్ చిత్రాన్ని ప్రేక్షకులు చిరస్థాయిగా గుర్తుంచుకునేవిధంగా తీశాడు. ఈ సినిమాలో సిద్దార్థ్ కి ఎంత మంచి పేరు వచ్చిందో.. ఆయన మేనకోడలుగా చేసిన అమ్మాయికి కూడా అంతే పేరు ప్రఖ్యాతలు దక్కాయి. ఈ చిన్నారి పేరు సహస్ర శ్రీ. ఈ సినిమాలో ఆమె ఎంతో సహజసిద్ధమైన నటనను కనబరిచింది. ఎవరు పాప ఇంత చక్కగా నటించింది. ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదే అని ఈ మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అనుకున్నారు. 

Advertisement

ఆమె తెలుగు ఆడియన్స్ కొత్తనే అయి ఉండవచ్చు. కానీ తమిళ ఆడియన్స్ కి మాత్రం బాగా సుపరిచితమే. ఇది వరకు ఎన్నో సినిమాల్లో నటించింది. ఓ యూట్యూబ్ ఛానల్ లో కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చి చాలా పాపులర్ అయింది.  ఈ పాప మరెవ్వరో కాదండోయ్.. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కజిన్ కొడుకు కి కూతురు అంట. సిద్ధార్థ్ కి మొదటి నుంచి ప్రకాశ్ రాజ్ తో ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరికీ ఇంచు, మించుగా ఒకే వయస్సు కూడా ఉంటుంది. సిద్ధార్థ్ ఈ మూవీని తీయాలనే ఆలోచన ప్రకాశ్ రాజ్ కి చెప్పినప్పుడు ఆయన మా అమ్మాయి నువ్వు చెప్పిన పాత్రకు సరిగ్గా సరిపోతుంది. ప్రయత్నం చేయమని చెప్పాడట. అలా సహస్ర ఈ చిత్రంలోకి వచ్చింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 ‘లియో’ టైటిల్‌ కోసం నాగవంశీ ఎన్ని లక్షలు ఖర్చు చేశారో తెలుసా ?

అక్కినేని ఇంట విషాదం.. నాగార్జున సోదరి కన్నుమూత

Visitors Are Also Reading