Home » మంచు విష్ణు ‘కన్నప్ప’ బడ్జెట్‌ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మంచు విష్ణు ‘కన్నప్ప’ బడ్జెట్‌ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Ad

టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మంచు విష్ణు చేస్తున్న మూవీ కన్నప్ప. ఈ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తూనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు దశాబ్దకాలంగా ఈ సినిమా గురించి విష్ణు చర్చలు జరుపుతూనే ఉన్నాడట. తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో ఒకటిగా చెప్పుకుంటూ వచ్చిన మంచు విష్ణు..ఎట్టకేలకు తన సినిమాను ప్రారంభించాడు.

Advertisement

అయితే ఈ సినిమాలో భారీ ఎత్తున స్టార్ కాస్టింగ్ ను  చూపించబోతున్నాడు. విదేశాల్లో షూటింగ్ చేస్తున్నాడు. గ్రాఫిక్ వర్క్ కోసం భారీ ఎత్తున ఖర్చు చేయబోతున్నాడు. మొత్తానికి ఈ సినిమా మంచు విష్ణు కెరీర్ లో ఇప్పటివరకు వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాల బడ్జెట్ తో పోల్చితే రెండు మూడు రెట్లు అధికంగా ఉంటుందని అంటున్నారు. విష్ణు సినిమా ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా పాతిక కోట్ల వరకు మాత్రమే వసూళ్లు సాధించగలదు. అలాంటిది కన్నప్ప సినిమాను దాదాపు 175 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించడం చర్చనీయాంశంగా మారింది. ముందుగా ఈ సినిమాకి రూ.150 కోట్లు అనుకున్నారు. మేకింగ్ సమయానికి 175కోట్లుగా మారింది.

Advertisement

మేకింగ్ పూర్తయి విడుదల సమయానికి కచ్చితంగా సినిమా రూ.200 కోట్ల వరకు పెరిగే అవకాశాలున్నాయంటూ.. ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఈ రేంజ్ లో మంచు విష్ణు సినిమాకి వర్కౌట్ అయ్యేనా అంటే కచ్చితంగా వర్కౌట్ అవుతుంది అంటున్నారు. కన్నప్ప బడ్జెట్ విషయంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున సక్సెస్ చేసుకుంటామనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. అందుకే ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు అంటున్నారు. మంచు విష్ణు ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడట. 

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading