Home » టొమాటో జ్యూస్ ఉద‌యం తాగితే క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే అస్స‌లు వ‌ద‌ల‌రు..!

టొమాటో జ్యూస్ ఉద‌యం తాగితే క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే అస్స‌లు వ‌ద‌ల‌రు..!

by Anji

టొమాటోల్లో చాలా పోష‌క విలువలు ఉంటాయి. వీటిని ప్ర‌తి రోజూ తిన‌డం ద్వారా ప‌లు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. సాధార‌ణంగా ట‌మాటాల‌ను శ‌క్తినిచ్చే కూర‌గాయ‌గా ప‌రిగ‌ణిస్తారు. ఎప్పుడైనా అలిసి పోయినట్టు అనిపించిన‌ప్పుడు చాలా మంది ఎన‌ర్జీ డ్రింక్ తీసుకోవాల‌ని అనుకుంటారు. అయితే ఎన‌ర్జీ డ్రింక్స్ ఆరోగ్యానికి చాలా హానిక‌రం. అటువంటి ప‌రిస్థితిలో ట‌మోటా జ్యూస్ మీ ఆరోగ్యానికి ఎన‌ర్జీ డ్రింక్ కంటే ఏం త‌క్కువ కాదు అని తెలిపారు. అధిక వ్యాయామం త‌రువాత కూడా శ‌రీరంలో శ‌క్తిని నిర్వ‌హించ‌డానికి ట‌మామా త‌క్కువ కాద‌ని తెలిపారు. టొమాటో జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఫైబ‌ర్‌, కార్బోహైడేట్లు, విట‌మిన్లు, పొటాషియం, ఫాస్ప‌ర‌స్ వంటి ముఖ్య‌మైన ఖ‌నిజాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ ర‌సం శ‌రీరానికి చాలా మంచిది అని భావిస్తారు. టొమాటో ర‌సం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

 

  • టొమాటో జ్యూస్‌లో విట‌మిన్లు బి-3, ఇ, లైకోపిన్ ఉన్నాయి. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని త‌గ్గిస్తాయి. దీంతో పొటాషియం ర‌క్త‌పోటును త‌గ్గిస్తుంది. గుండెపోటు వ‌చ్చే అవ‌కాశాల‌ను కూడా నియంత్రిస్తుంది.

Also Read :  న‌వ‌రాత్రుల్లో ఉప‌వాసం ఉంటున్నారా..? అయితే మూడింటిని అస్స‌లు తీసుకోవ‌ద్దు..!

  • టొమాటో ర‌సంలో విట‌మిన్ కే, కాల్షియం ఉంటాయి. ఎముక‌ల‌ను బ‌లంగా మార్చుతుంది. టొమాటో ర‌సం తీసుకుంటే ఎముక‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి.

 

  • టొమాటో ర‌సం ధూమ‌పానం వ‌ల్ల శ‌రీరానికి క‌లిగే న‌ష్టాన్ని త‌గ్గిస్తుంది. టొమాటోలో క్లోరోజెనిక్ యాసిడ్, కౌమారిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి సిగ‌రేట్ ద్వారా శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే క్యాన్స‌ర్ కార‌ణాల‌తో పోరాడుతాయి.

  • టొమాటో జ్యూస్‌లో మంచి మొత్తంలో విట‌మిన్ సి ఉంటుంది. ఇది మీ రోగ‌నిరోధ‌క శ‌క్తిపై సానుకూల ప్ర‌భావాన్ని చూపుతుంది. టొమాటో ర‌సం జ‌లుబు, ఫ్లూ నుంచి ర‌క్షించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. దీంతో శ‌రీరానికి మ‌రెన్నో ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయి.
  • మీకు కిడ్నీ స‌మ‌స్య ఉన్న‌ట్ట‌యితే చాలా ప‌రిమిత ప‌రిమాణంలో టొమాటో ర‌సం తీసుకోవాలి. అల‌ర్జీ ఉన్న వారు టొమాటో జ్యూస్ తాగ‌డం మానేయాలి. గ‌ర్భ‌వ‌తి అయినా లేదా బాలింత‌లు అయినా టొమాటో ర‌సం తీసుకునే ముందు త‌ప్ప‌నిస‌రిగా వైద్యున్ని సంప్ర‌దించాలి.

Also Read :  ప్ర‌తి రోజూ ప‌ర‌గ‌డుపున వాల్ న‌ట్స్ తింటే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

Visitors Are Also Reading