Home » జల్సా రాయుడు నరేష్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

జల్సా రాయుడు నరేష్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

టాలీవుడ్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య కాలంలో నరేష్-పవిత్ర గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే నరేష్ విజయ నిర్మల కొడుకుగానే బాలనటుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించాడు. అయితే నరేష్ సూపర్ స్టార్ కృష్ణ సొంత కొడుకు కాదు. కృష్ణ కంటే ముందే విజయనిర్మల షిప్ డిజైనర్ గా పని చేసే  కృష్ణమూర్తిని పెళ్లి చేసుకుంది.  వీరిద్దరికీ కలిగిన సంతానమే నరేష్. టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సక్సెస్ ఫుల్ హీరోగా హిట్ చిత్రాల్లో నటించారు. హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారమెత్తాడు.

Advertisement

ప్రస్తుతం  నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ పుల్ గా కొనసాగుతోంది.  మంచి డిమాండ్ ఉన్న నటులలో నరేష్ కూడా ఒకడు. రెమ్యూనరేషన్ లక్షల్లో తీసుకుంటున్నాడు.  ఇతనికి ముగ్గురు భార్యలు. ఇప్పటికే ఇద్దరితో అధికారికంగా విడిపోయారు. కానీ మూడో భార్య రమ్య రఘుపతితో మాత్రం వివాదం నడుస్తోంది. నరేష్ కి స్టెప్ ఫాదర్ కృష్ణ, తల్లి విజయ నిర్మల నుంచి పెద్ద మొత్తంలో ఆస్తి వచ్చిందట. ఆయన నటుడిగా కూడా కొంత సంపాదించారు. నరేష్ ఆస్తి విలువ వందల కోట్లల్లో ఉంటుందని టాక్.  నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మళ్లీ పెళ్లి. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల అయింది. నరేష్ అసిస్టెంట్ మీకేంటీ సార్ వెయ్యి కోట్ల ఫిగర్ అనే డైలాగ్ చెబుతుంటాడు. నిజ జీవితంలో నరేష్ ఆస్తుల విలువ అంచనా వేసే డైలాగ్ అని తెలుస్తోంది.

Advertisement

మళ్లీ పెళ్లి సినిమా నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగానే తెరకెక్కించారట. మూడో భార్య రమ్య రఘుపతితో అసలు  గొడవలు ఎందుకు వస్తున్నాయి ? నటి పవిత్ర లోకేష్  నరేష్ జీవితంలోకి ఎలా వచ్చింది ? నరేష్ లైఫ్ లో కీలకంగా మారిన  రమ్య రఘుపతి, పవిత్ర లోకేష్ లతో చోటు చేసుకునే సంఘటనలను ఆధారంగానే చేసుకొని తీసినట్టు తెలుస్తోంది.  అయితే తన బయోఫిక్ ఏమి కాదని నరేష్ చెబుతున్నప్పటికీ ట్రైలర్, టీజర్ చూస్తే మాత్రం.. ఆయన అబద్ధం చెబుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు నరేష్ కుమారుల్లో ఒకరైనటువంటి నవీన్ విజయ్ కృష్ణ రెండు సినిమాలు చేశాడు.

Manam News

ఈ మధ్య అతను తండ్రికి వ్యతిరేకంగా కామెంటస్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కాలం నుంచి నరేష్ జీవితంలో హైడ్రామా నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారమంతా నరేష్ నటించే మళ్లీ పెళ్లి మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా కలిపి పూర్తి ఫ్యామిలీ డ్రామా చేశారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మళ్లీ పెళ్లి మూవీ కూడా వివాదాలకు వేదిక కావడం ఖాయం అని తెలుస్తోంది. ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్వయంగా నిర్మాతగా నరేష్ వ్యవహరిస్తున్నాడు. వనిత విజయ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. శరత్ బాబు కృష్ణ గా, జయసుధ విజయ నిర్మలగా నటించారు. మే 26న మళ్లీ పెళ్లి మూవీ విడుదల కానుంది. 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :

వేణుమాధవ్‌, ఉదయభాను మధ్యలో ఉన్న ఈ కమెడియన్‌ ఎవరో గుర్తుపట్టారా?

Sr. NTR తన తల్లిని కాకుండా ఆమెను కూడా ‘అమ్మ’ అని పిలిచేవారట..!!

పవన్ మొదటి భార్య నందిని మామూలుది కాదు.. ఎన్ని కోట్లకు అధిపతి అంటే..!అంటే..!

Visitors Are Also Reading