Home » మీకు ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్ల‌యితే గుండెలో రంద్రం ఉన్న‌ట్టే.. వెంట‌నే డాక్ట‌ర్‌ని సంప్ర‌దించండి..!

మీకు ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్ల‌యితే గుండెలో రంద్రం ఉన్న‌ట్టే.. వెంట‌నే డాక్ట‌ర్‌ని సంప్ర‌దించండి..!

by Anji
Ad

ప్రస్తుత కాలంలో చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు సరైన సమయంలో ఈ వ్యాధులను గుర్తించలేక తీవ్రవ్యాధుల బారిన పడుతున్నారు. అదే సమయంలో గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్య గుండెలో రంద్రం ఉండడం. గుండెలో రంధ్రం ఉండడం అనేది ఒక తీవ్రమైన సమస్య. నిజానికి ఈ సమస్య పుట్టుకతోనే వస్తుంది. కానీ గుండెలో రంధ్రం ఏర్పడితే దాని లక్షణాలను సరైన సమయంలో గుర్తించడం చాలా కష్టం. అయితే సరైన సమయంలో గుర్తించడం ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో గుండెకు రంధ్రం ఏర్పడినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

గుండెలో రంధ్రం ఉంటే ఎప్పుడూ అలసటగా అనిపించడం ఎక్కువగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఎల్లప్పుడూ అలసిపోయి ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటే దానిని నెగ్లెట్ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే గుండెలో రంధ్రం ఉంటే శరీరం వేడి వాతావరణం లో కూడా చల్లబడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వేసవికాలంలో చల్లగా ఉన్న లేదా మీ శరీరం ఎల్లప్పుడూ చల్లగా ఉంటే అప్పుడు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే అలాంటి సమస్య ఉంటే గుండెకు రంధ్రం లేదా గుండె సంబంధిత వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.

Advertisement

Also Read :  ఎక్కువ సేపు కూర్చుని ప‌ని చేస్తే ప్రాణానికే ప్ర‌మాదం.. జాగ్ర‌త్త‌..!


గుండెలో రంద్రం సమస్యతో బాధపడేవారు ఉంటే పిల్లల శరీరం రంగు నీలం రంగులోకి మారుతుంది. ఈ సమయంలో పెదవులు, గోర్లు తీవ్రంగా ప్రభావితమవుతాయి. అటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే మీరు మాట్లాడేటప్పుడు లేదా నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం ప్రారంభిస్తే గుండెలో రంద్రం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో పిల్లలు కూడా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతూ కనిపిస్తారు. శ్వాస తీసుకోవడంలో మళ్లీమళ్లీ ఇబ్బంది ఉంటే నిమోనియా, గుండె జబ్బులు లేదా గుండెలో రంధ్రం వంటి సమస్యలను కూడా కలిగి ఉండవచ్చు. అలాంటప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Also Read :  వెల్లుల్లిని ప‌ర‌గ‌డుపున తేనెలో క‌లుపుకుని తింటే.. బ‌రువుతో పాటు ఈ 4 స‌మ‌స్య‌లు మాయం

 

Visitors Are Also Reading