తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. మొత్తం 503 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. మే 02 నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 31 నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో స్పష్టం చేసారు. చాలా మంది అభ్యర్థులకు పోస్టుల కేటాయింపు సరిగ్గా జరుగలేదనే అనుమానం కలుగుతోంది. పోస్టులను పే ప్రాతిపదికన కేటాయిస్తారనే అంశం ఇప్పుడు తెలుసుకోండి.
ముఖ్యంగా గ్రూపు పోస్టులను రోస్టర్ విధానం ద్వారా కేటాయిస్తారు. చాలా మంది అభ్యర్థులు 503 పోస్టులకు కలిపి రోస్టర్ విధానం కేటాయిస్తారని అభిప్రాయం పడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. అది సరైనది కాదని.. 503 పోస్టులను కలిపి చూడకూడదు. శాఖల వారిగా పోస్ట్.. మల్టీజోన్-1, మల్టీజోన్-2లకు కేటాయించిన పోస్టులను బట్టి రిజర్వేషన్‌ను విభజిస్తారు. అంతేకాకుండా రోస్టర్ ప్రకారం.. 48 పోస్టులకు ఒకటి మాత్రమే స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేశారు. 98 పోస్టుల వరకు రెండవ పోస్ట్ కేటాయిస్తారు. ఆ లోపు పోస్టులు ఉన్న శాఖల్లో స్పోర్ట్స్ కోటా ఉండదు.
Advertisement
Advertisement
ఈ సంవత్సరం ప్రభుత్వం కొత్త రోస్టర్ ను ప్రారంభించింది. ప్రతిశాఖలో తొలిపోస్టును ఓసీ మహిళ, రెండవ పోస్ట్ ఎస్సీ మహిళ, మూడవ పోస్ట్ ఓసీ, నాలుగవ పోస్ట్ బీసీ-ఏ మహిళ, 5వ పోస్ట్ ఓసీ, 6వ పోస్ట్ వికలాంగ మహిళ ఇలా రోస్టర్ కేటాయించారు. ఈ సారి తక్కువ పోస్టులు ఉన్న శాఖలలో ఈ రోస్టర్ అనుసరించడంతో మహిళలకు ఎక్కువ పోస్టులొచ్చాయి. ఉదాహరణకు ఏదైనా మల్టీజోన్-2లో 1 పోస్ట్ ఉంది అనుకుటే.. ఎవరికీ కేటాయించాలన్నది ప్రస్తుత ప్రశ్న..? రోస్టర్ ప్రకారం.. తొలి పోస్టు జనరల్ మహిళకు వెళ్లుతుంది.
మల్టీజోన్-2లో మొత్తం 100 పోస్టులు ఉంటే.. 33 శాతం ప్రకారం.. 33 పోస్టులు మహిళలకు దక్కడమే కాకుండా ఎవరి రిజర్వేషన్ కోటా ప్రకారం.. వారికి వస్తాయన్నది ఒకే పోస్టు కావడంతో రోస్టర్‌ను అనుసరించి జనరల్ మహిళకు కేటాయించారు. మరో 30 పోస్టులకు టీఎస్పీఎస్సీ మరొక నోటిఫికేషన్ ఇస్తే.. అప్పుడు 2వ రోస్టర్ పాయింట్ నుంచి ప్రారంభం అయి 30వ రోస్టర్ పాయింట్ వరకు ఉన్న రిజర్వేషన్ ప్రకారం.. కేటాయిస్తారు. వంద పోస్టులు భర్తీ అయ్యే వరకు ఇలాగే కొనసాగుతుంది. 100 పోస్టులు భర్తీ అయ్యాక తిరిగి రోస్టర్ -1 ప్రకారం.. ఆ పోస్టును తిరిగి జనరల్ మహిళలకు కేటాయిస్తారు. అభ్యర్థులు గందరగోళానికి గురికాకుండా రోస్టర్ విధానాన్ని తెలుసుకుని దృష్టి సారించాలని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read :
Acharya : చిరంజీవి సినిమాలలోనే ఘోర పరాభవం అప్పుడే థియేటర్ల నుంచి సినిమా తొలగింపు..!
అరటిపండు తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా..?