ఇటీవల కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేదం విధించిన విషయం తెలిసినదే. ప్రధానంగా జులై 01 నుంచి సింగిల్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి నిలువ, అమ్మకాలను నిషేదించింది. ఈ తరుణంలో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి గుజరాత్‌లోని ఓ కేఫ్ అద్భుతమైన మార్గాన్ని కనిపెట్టింది. జునాగఢ్ జిల్లా యంత్రాంగం నేచురల్ ప్లాస్టిక్ కేఫ్ పేరుతో ఓ కేఫ్ ను ప్రారంభించనున్నది. ప్లాస్టిక్ రూపంలో పేమెంట్స్ ను చెల్లింపును అంగీకరిస్తారు. కేఫ్‌లో ఏమైనా ఆహార పదార్థాలను తీసుకుంటే వాటికి డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఇస్తే సరిపోతుంది.
Advertisement
ప్రజలు తమ ఇంటి వద్ద నుంచి ఎలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలనైనా తీసుకురావచ్చు. బరువును బట్టి మెనులో ఉన్న ఆహారపదార్థాలను కొనుగోలు చేయొచ్చు. ఏదో ఒకటి రెండు ఆహార పదార్థాలు కాదు. ఎన్నో రకాల గుజరాత్ సంప్రదాయ రుచులు అందుబాటులో ఉన్నాయి. 500 గ్రాముల ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే.. ఒక గ్లాస్ లెమన్ జ్యూస్ లేదంటే ఫెన్నెల్ జ్యూస్ ఇస్తారు. కిలో ప్లాస్టిక్ తీసుకొస్తే ఒక ప్లేట్ పోహా, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ ఆహార పదార్థాలను ఇస్తారు.
Advertisement
ప్లాస్టిక్ కేఫ్‌నకు కావాల్సిన మౌలిక సదుపాయాలను జిల్లా యంత్రాంగం అందించింది. నిర్వహణ బాధ్యతను కూడా స్థానిక మహిళలకే అప్పగించింది. సర్వోదయ్ సఖి మండల్‌కు చెందిన మహిళలు కేఫ్‌లో పని చేస్తారు. కేఫ్ అభివృద్ధికి సర్వోదయ్ సఖి మండల్ గ్రూప్ 50వేల రూపాయలు అందించింది. ఇక ఈ కేఫ్ సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను జునాగడ్ అధికార యంత్రాంగంతో ఒప్పందంతో చేసుకున్న రీ సైక్లింగ్ ఏజెన్సీకి పంపిస్తారు. అక్కడ వాటిని రీసైకిల్ చేస్తారు. ఈ కేఫ్ ద్వారా క్లీన్ అండ్ గ్రీన్ జునాగడ్ అనే నినాదాన్ని ప్రచారం చేస్తున్నామని కలెక్టర్ రచిత్ రాజ్ పేర్కొన్నారు. భారత్ లో ప్రతి సంవత్సరం 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్లాస్టిక్ కర్రలు, స్ట్రాస్,ప్లేట్లు, కప్పులు వంటి సింగిల్ ప్లాస్టిక్ వస్తులపై పూర్తిగా నిషేదం విధించింది.
Also Read :
ఓవైపు నరేష్-పవిత్ర బందం.. మరోవైపు రమ్య వైరం.. వీరి మధ్యలో ట్విస్ట్‌లు ఏమిటంటే..?
నందమూరి తారక రామారావు తన మనవరాళ్ల పేర్లు అలా ఎందుకు పెట్టారు..? వాళ్ళ పేర్లు ఏంటంటే ?