మహాభారతంలో ధృతరాష్ట్రుడి సవతి కొడుకు విదురుడు. ఈయన గొప్ప జ్ఞానవంతుడు. దూర దృష్టి కలిగి న వ్యక్తి. ముఖ్యంగా కొన్ని సమస్యలను ముందుగానే ఊహించేవాడు. కురుక్షేత్ర యుద్ధం చాలా ఘోరంగా ఉంటుందని ధృతరాష్ట్రుడిని హెచ్చరించాడు. విదురుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీకృష్ణుడితో పాటు విదురుడి సలహాలున్నాయి. పాండవులు విదురుడి మాటలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. భీష్ముడు విదురుడి సలహాలను తీసుకునేవాడు. విదురుడు ప్రజలకు సహాయం చేయడం కోసం కొన్ని ప్రత్యేక విషయాలను వెల్లడించాడు. ఇవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
విదురుడు చెప్పిన ప్రకారం.. మీ సంతానానికి మీరు ఇష్టపడే వ్యక్తల క్షేమం కోరుకుంటున్నారో వారికి మంచితో పాటు చెడు గురించి కూడా హెచ్చరించాలని విదురుడు తెలిపారు. ఇలాంటి విషయాలు చెప్పడంలో ఆలస్యం చేయకూడదని.. వారు అడిగే వరకు వేచి ఉండకూడదని చెడు గురించి హెచ్చరించాలి. ఒకవేళ హెచ్చరించినా వారు వినిపించుకోకపోతే అది వారి నిర్ణయానికే వదిలేయాలి. ఇలా చేయడం ద్వారా మీరు అన్ని విషయాలతో పాటు తప్పు విషయాలపై కూడా వారికి అవగాహన కలిగించినట్టయితే వారు మీపై సంతృప్తిగా ఉంటారు. ఇప్పుడు ఆ వ్యక్తి తన మంచి చెడులను చూసి తన నిర్ణయం తీసుకోవచ్చు.
Advertisement
Advertisement
ఇలా చేయడం ద్వారా రెండు లాభాలుంటాయి. ముందు అన్ని తెలిసిన హెచ్చరించలేదనే అపరాధ భావం కలగదు. అంతేకాదు.. ఆ వ్యక్తి భవిష్యత్‌లో మీరు తన శ్రేయాభిలాషి అని నమ్ముతారు. విదురుడి విదానాలే కాకుండా అతని జీవితం అంతా అదే సందేశాన్ని ఇస్తున్నట్టు అనిపిస్తుంది. విదురుడు స్వయంగా తన విధానాలను ధృతరాష్ట్రుడికి చెప్పాడు. యువకుడు అయినటువంటి దుర్యోదనుడు దర్మానికి వ్యతిరేకంగా ఉన్నాడని అతనికి ఫలితం అలాగే ఉంటుందని సూచించాడు. దుర్యోదనుడు విదురుడి విధానాలను అస్సలు అంగీకరించలేదు. దాని ఫలితం కౌరవుల నాశనానికి కారణమైంది. అవమానం, నిర్లక్ష్యం ఉన్నప్పటికీ విదురుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. దగ్గరి వారికి అడగకుండానే సలహాలు ఇవ్వమని విదురనీతి తెలుపుతుంది.
Also Read :
Chanakya Niti : మనిషి ఈ విషయాలకు చాలా దూరంగా ఉండాలి.. లేదంటే భారీ నష్టం..!
Vidura Niti : ఒక వ్యక్తిలో ఈ 8 గుణాలు ఉంటే చాలు.. అందరిచే గౌరవించబడతారట..!