Home » Vidura Niti : ఒక వ్య‌క్తిలో ఈ 8 గుణాలు ఉంటే చాలు.. అంద‌రిచే గౌర‌వించ‌బ‌డ‌తార‌ట‌..!

Vidura Niti : ఒక వ్య‌క్తిలో ఈ 8 గుణాలు ఉంటే చాలు.. అంద‌రిచే గౌర‌వించ‌బ‌డ‌తార‌ట‌..!

by Anji
Ad

హిందూ ధ‌ర్మంలో రామాయ‌ణ‌, మ‌హాభార‌తాల గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ ఇతిహాసాలు నేటి మాన‌వుల జీవితానికి మంచి, చెడుల గురించి చెబుతుంటాయి. పాండురాజు ధృత‌రాష్ట్రుల‌కు స‌వ‌తి త‌మ్ముడు విద‌రుడు. ఈయ‌న మ‌హానీతిమంతుడు. విదురుడు కురువంశ పితామ‌హుడైన భీష్ముడు ద‌గ్గ‌ర విద్య‌ను నేర్చుకున్నాడు. విదురుడు ధృత‌రాష్ట్రుడి కొలువులో మంత్రి, కౌర‌వులు పాండ‌వులకు చేసిన అన్యాయాల‌కు విదురుడు ప్ర‌త్య‌క్ష సాక్షి. అన్యాయం సహించ‌ని నైజం విధురుడిది.


ప్ర‌పంచంలోనే గొప్ప నీతివేత్త‌ల్లో మ‌హాత్మ విదుర పేరు ప్ర‌సిద్ధి గాంచింది. గొప్ప ఆలోచ‌న‌ప‌రుడు అయిన విదురుడు చెప్పిన నియ‌మాలు నేటి కాలంలో ప్ర‌జ‌లు అనుస‌రిస్తే క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మ‌హాత్మ విదుర మ‌నిషిలో క‌నిపించే ఎనిమిది గుణాల గురించి చెప్పారు. ఈ గుణాల‌ను పాటిస్తే ప్ర‌పంచంలో అంద‌రిచే గౌర‌వించ‌బ‌డ‌తాడు అని చెప్పారు. ఆ ఎనిమిది గుణాలు ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement


ఒక మ‌నిషికి స్వ‌భావం అత‌నికి స‌మాజంలో భిన్న‌మైన గుర్తింపుని ఇస్తుంది. ఒక మ‌నిషి స్వ‌భావం కార‌ణంగానే అత‌ను ఉత్తీర్ణ‌త సాధించిన విఫ‌లం అవుతాడు. స‌ర‌ళంగా, స‌హ‌జంగా ఉంటే ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని ఇష్ట‌ప‌డ‌తారు. అదేవిధంగా అందరూ గౌర‌విస్తారు.

 

ఒక మ‌నిషి త‌న ఇంద్రియాలు లేదా మ‌న‌సుని నియంత్రించుకునే సామ‌ర్థ్యం క‌లిగి ఉండాలి. అలాంటి వ్య‌క్తి ఎల్ల‌ప్పుడూ చేసే ప‌నిలో విజ‌యాన్ని సొంతం చేసుకుంటాడు. స‌మాజంలో ప్రతి ఒక్క‌రూ అతడిని గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో ఆద‌రిస్తారు.

Advertisement

మ‌నిషికి ఇత‌రుల‌కు సాయం చేసే స్వ‌భావం ఉండాలి. అలాంటి వ్య‌క్తుల‌ను ప్ర‌జ‌లు ఎల్ల‌ప్పుడూ గౌర‌విస్తారు. అదేవిధంగా క‌ష్ట‌స‌మ‌యాల్లో ప్ర‌జ‌లు ఎల్ల‌వేళ‌లా అలాంటి వ్య‌క్తుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌తారు.

మ‌న హిందూ ధ‌ర్మంలో దాతృత్వం అనేది స‌ద్గుణంగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. దానం చేసే వ్య‌క్తి ఎప్ప‌టికీ కీర్తించ‌బ‌డుతాడు. అత‌డు స‌మాజంలో గొప్ప వ్య‌క్తిగా గౌర‌విస్తారు.

మ‌నిషికి తెలివితేట‌లు ఉండ‌డం పెద్ద విష‌యం కాదు. ఆ తెలివి తేట‌ల‌కు మంచి ప‌నుల‌కు ఉప‌యోగించ‌డం చాలా ముఖ్యం. త‌న తెలివి తేట‌ల‌ను స‌రైన మార్గంలో ఉప‌యోగించే వ్య‌క్తి జీవితంలో ప్ర‌తి విష‌యాల్లో విజ‌యాన్ని అందుకుంటాడు. గౌర‌వాన్ని పొందుతాడు.

ఒక మ‌నిషి త‌న జ్క్షానాన్ని పెంపొందించుకుంటే అత‌నికి ప్ర‌తి చోట త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. అత‌ని జ్ఞానంతో తెలిసిన వారు తెలియ‌ని వారితో కూడా గౌర‌వించ‌బడ‌తారు.అంతేకాదు అటువంటి మ‌నిషి నుంచి జ్ఞానాన్ని పొందాల‌ని త‌ప‌న‌లో ప్ర‌తి ఒక్క‌రికీ అనిపిస్తుంది.

ఒక శ‌క్తిమంత‌మైన వ్య‌క్తి త‌న సొంత బ‌లంతో కీర్తిని పొందుతాడు. ప్ర‌పంచంలో ప్ర‌జాదార‌ణ పొంద‌డానికి ధైర్యంగా ఉండ‌డ అవ‌స‌రం. ప్ర‌పంచంలోని ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిస్థితి అంచ‌నా వేస్తూ ఆలోచ‌న‌త్మ‌కంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అటువంటి త‌ప్ప‌నిస‌రిగా స‌మాజంలో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు.

Also Read : 

వ‌ర్షాకాలంలో ఈ కూర‌గాయ‌లు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు..!

Chanakya Niti : ఇంటి పెద్ద‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణాలు ఇవే..!

Visitors Are Also Reading