Home » రంజాన్ మాసంలో పెరుగు, యాలకులు, పుదీనా తింటే ఆ రోజంతా దాహం వేయదా?

రంజాన్ మాసంలో పెరుగు, యాలకులు, పుదీనా తింటే ఆ రోజంతా దాహం వేయదా?

by Anji
Ad

రంజాన్ మాసంలో సెహ్రీ లేదా ఇప్తార్ విందులో ప్రతీ ఒక్కరి ఇష్టాలను పరిగణలోకి తీసుకొని ఆహారంలో రకరకాల వంటకాలను తయారు చేస్తుంటారు. ఇక ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. రంజాన్ మాసం కొన్ని సార్లు ఎండకాలంలో వస్తే.. మరికొన్ని సార్లు శీతాకాలంలో వస్తుంది.రంజాన్ నెలలో చుక్క నీరు ముట్టుకోకుండా ముస్లింలు కఠినంగా ఉపవాసం చేస్తారు. వేసవి సమయంలో ఉపవాసం ఉన్నప్పుడు దాహం వేస్తే ఏం చేయాలనే ప్రశ్న అందరికీ కలుగుతుంది.  

Also Read :  వేసవిలో పుచ్చకాయ తింటే ఏం అవుతుందో తెలుసా? ఎలాంటి లాభాలు ఉన్నాయి

Advertisement

ఈసారి రంజాన్  మాసం ఏప్రిల్ నెలలో వచ్చింది. ఈ సమయంలో పాకిస్తాన్, భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వాతావరణం కాస్త మెరుగ్గానే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వేసవి తాపం కనిపిస్తోంది. రంజాన్ మాసం ప్రారంభ సమయంలో ప్రతి ఒక్కరూ దాహం నుంచి తప్పించుకోవడానికి తమకు తోచిన చిట్కాలను పంచుకుంటారు. దాహాన్ని తగ్గించుకోవడం కోసం సెహ్రీ భోజన సమయంలో యాలకులు, పుదీనా, పెరుగు తినడం వల్ల నీరు ఎక్కువగా తాగాలని భావిస్తారు. దీంతో దాదాపు 14 గంటల కన్నా ఎక్కువ సమయం ఉపవాసం ఉండవచ్చు. అదేవిధంగా దాహం వేయకుండా హాయిగా గడిచిపోతుందని పేర్కొంటారు. సెహ్రీ సమయంలో పెరుగు తినడం వల్ల మన పొట్టలో చాలా సమయం ఉంటుంది. 

Advertisement

Also Read :   ఖాళీ కడుపుతో మీరు టీ తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలతో జాగ్రత్త..!

దీంతో చాలా సమయం ఆకలిగా అనిపించదు. పెరుగులో పొటాషియం ఉంటుంది. సోడియం తక్కువగా ఉండడంతో దాహం కూడా వేయదు అని పలువురు నిపుణులు చెబుతున్నారు. అలాగే పచ్చి యాలకులు, పుదీనా ఆకులను సలాడ్ లో తినడం వల్ల ఎలాంటి సమస్య దరిచేరదని పేర్కొంటున్నారు నిపుణులు. ఎల్లప్పుడూ తాజా దనాన్ని ఇస్తాయి. మరోవైపు ఇఫ్తార్ విందు సమయంలో చల్లని షర్బత్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. రోజూ మొత్తం ఖాళీ కడుపుతో ఉండి.. ఒక్కసారిగా శీతల పానీయాలు తీసుకుంటే పొట్టలే ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, ఇప్తార్ లో శీతల పానీయాల మిల్క్ షేక్, లస్సీ, నిమ్మరసం వంటివి మంచివి అని నిపుణులు చెబుతున్నారు. 

Also Read :   పుష్ప- 2 ట్రైల‌ర్ తో అల్లు అర్జున్ గ‌రిక‌పాటి నోరు మూయించాడా..?

Visitors Are Also Reading