ప్రస్తుతం శీతాకాల సీజన్ నడుస్తోంది. చలిగాలులు కూడా రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. దీంతో గ్రామాల్లో అయితే బయటకి వెళ్తే గజగజ వనికే పరిస్థితి ఏర్పడింది. అలాంటి శీతాకాలంలో అనేక సీజనల్ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకొని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.. దీనికోసం వెల్లుల్లి అనేది మంచి ఔషధంగా పనిచేస్తుంది.. మరి వెల్లుల్లి తింటే మన శరీరానికి ఎన్ని లాభాలో ఇప్పుడు చూద్దాం..
also read:వరలక్ష్మి శరత్ కుమార్:ఆ రెండు హిట్ సినిమాలు వదులుకొని తప్పు చేశా..!!
Advertisement
Advertisement
శీతాకాలంలో వెల్లుల్లి తింటే జీర్ణ క్రీయకు సంబంధించిన రోగాలు నయం అవ్వడమే కాకుండా శ్వాసకోశ వ్యాధులు కూడా పరిష్కారం చేసే పోషక విలువలు ఉంటాయట. వెల్లుల్లి రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. వెల్లుల్లిలో ఐరన్, కాల్షియం, పోలేట్ మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం, విటమిన్ సి, పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలో యాంటీవైరస్ లక్షణాలు అనేకం. ఇది జలుబు, దగ్గు సీజనల్ వ్యాధులపై సమర్థంగా పోరాడతాయి. వెల్లులిలో ఇమ్యునో మోడ్యులేటింగ్ ప్రభావాలు కలిగి ఉంటాయి.
ఇందులో ఉండే అల్లిసిన్ శరీరంలో తెల్ల రక్త కణాలు ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణకోశ, శ్వాస,గుండె సంబంధిత సమస్యలు వస్తుంటాయి. వెల్లుల్లి తినడం వల్ల శరీరానికి వెచ్చదనం ఉంటుంది. అంతేకాకుండా శీతాకాలపు అలర్జీలను వెల్లుల్లి తగ్గిస్తుంది. కాబట్టి శీతాకాలంలో వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు.
also read:రోజా కోరిక తీరింది.. దత్త పుత్రిక డాక్టర్ అయింది..!!