Home » వరలక్ష్మి శరత్ కుమార్:ఆ రెండు హిట్ సినిమాలు వదులుకొని తప్పు చేశా..!!

వరలక్ష్మి శరత్ కుమార్:ఆ రెండు హిట్ సినిమాలు వదులుకొని తప్పు చేశా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో పేరు సంపాదించిన హీరోయిన్లలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు.. ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాల్లో కీలక పాత్రలు చేసి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఈ విధంగా ప్రేక్షకులకు ఎంతో దగ్గరవుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.. యశోద సినిమా సక్సెస్ సాధించడంతో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలు చెప్పారు..

Advertisement

ఇండస్ట్రీలో బాయ్స్, ప్రేమిస్తే సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని కానీ తన తండ్రి శరత్ కుమార్ ఒప్పుకోకపోవడంతో నటించలేదని ఆమె చెప్పుకొచ్చారు. నాకు పని అంటే పిచ్చని ఏదైనా పని మొదలు పెడితే పూర్తయ్యే వరకు నిద్రపోనని తెలియజేశారు. నటనలో కూడా ఈ విధంగానే భావిస్తానని అన్నారు. ప్రస్తుతం సినిమాల్లో చేయడమే నా ప్రపంచమంటూ వరలక్ష్మి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నానని ఆమె అన్నారు.

Advertisement

also read:అన్న ఎన్టీఆర్ శ్రీదేవిని ఆ చిత్రంలో వద్దనడం వెనుక ఇంతటి రహస్యం ఉందా..?

నేను సినిమాల్లోకి రావడం మా నాన్నగారికి ఏమాత్రం ఇష్టం లేదని, బాయ్స్ ప్రేమిస్తే మూవీస్ భారీ సక్సెస్ఫుల్ గా దూసుకుపోయిన ఆ సినిమాలు నేను వదులుకున్నందుకు బాధ ఏమాత్రం లేదని కామెంట్లు చేశారు. ఒకవేళ చేసి ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో రేంజ్ మారేదని అన్నారు. జయమ్మ తరహా పాత్రలకు నేను ఆప్షన్ అని వరలక్ష్మి తెలిపారు. బాల గారు నాకు గురువు అని, ఆయన డైరెక్షన్ లో సినిమా చేస్తున్న టైంలో కాలర్ బోన్ విరిగిందని వెల్లడించారు. వీర సింహారెడ్డి చిత్రంలో ఐదు పేజీల డైలాగ్ ను సింగిల్ టేక్ లో చెప్పడం మెమొరబుల్ మూమెంట్ అని, నేను ఆ విధంగా చెప్పడంతో బాలకృష్ణ తో సహా అంతా చప్పట్లు కొట్టారని కామెంట్ చేశారు.

also read:

Visitors Are Also Reading