వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని సర్వసాధారణంగా వేధించే సమస్య జీర్ణసమస్యలో గ్యాస్ ముందు వరుసలో ఉంటుంది. ఆహారపు అలవాట్లు జీవన శైలిలో మార్పులు, వేళకు ఫుడ్ తీసుకోకపోవడ, ఒత్తిడి, బ్యాక్టీరియా వంటి రకరకాల కారణాల వల్ల జీర్ణవ్యవస్థ వీక్ అయిపోతుంటుంది. దీంతో గ్యాస్ సమస్య తరచూ వేధిస్తుంటుంది. దీనిని నివారించుకోవడం కోసం ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.
ఇవి కూడా చదవండి : ఈ హై ప్రోటీన్ సలాడ్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మీరు రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండడం పక్కా..!
Advertisement
ఇక మీరు ఈ జాబితాలో ఉన్నారా..? అయితే వర్రీ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే టీ ని తీసుకుంటే గ్యాస్ అన్న మాటే అనరు. మరీ లేటు ఎందుకు ఆ టీ ఏంటో, దానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ హీట్ అవ్వగానే అందులో చిన్న అల్లం ముక్క దంచినది, పది లేత వేప ఆకులు, రెండు టేబుల్ స్పూన్ల ఎండిన చామంతి పూలు వేసి చిన్న మంటపై 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆపై వాటర్‌ని స్ట్రైనర్ సాయంతో ఫిల్టర్ చేసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తేనే, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని మిక్స్ వేస్తే చామంతి వేప టీ సిద్ధమవుతుంది.
Advertisement
ఇవి కూడా చదవండి : రోడ్డుపైన డబ్బులు దొరికితే తీసుకోవచ్చా..? ఇది తప్పక తెలుసుకోండి..!
ఈ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతీ రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కి గంట ముందు ఈ టీని తీసుకుంటే వ్యర్థాలన్నీ బయటికి పోయి జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. దీని పని తీరు కూడా మెరుగుపడుతుంది. దీంతో గ్యాస్ ఒక్కటే కాదు ఎసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు సైతం దరి దారుల్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాదు.. చామంతి వేప టీని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే నిద్రలేమి సమస్య దూరమవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నెలసరి సమయంలో వేధించే నొప్పులు పరార్ అవుతాయి. ఒత్తిడి, ఆందోళన, డిఫ్రెషన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఇవి కూడా చదవండి : మీరు వేడి నీటిలో అల్లం కలిపి తాగుతున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!