వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు చాలా అవస్థలు పడుతుంటారు. ఈగలు, దోమలు, క్రిమి కీటకాల ద్వారా పలు సమస్యలు తలెత్తుతుంటాయి. దీనికి తోడు ఎండాకాలం వెళ్లిపోవడంతో భూ వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడిపోతుంది. అదేవిధంగా మనచుట్టు ఉండే పరిసర వాతావరణం కూడా మార్పు సంభవిస్తుంటుంది. చూడడానికి అంతా పచ్చగా కనిపిస్తుంటుంది. ఇక ఈ సీజన్‌లో రోగాల బెడద చాలా ఎక్కువగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Advertisement
వర్షాకాల సీజన్‌లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, సూక్ష్మజీవులు ఇలా ఒక్కటేంటి రకరకాలకు చెందిన ఏది ఎప్పుడు ఏక్షణంలో మనపై దాడి చేస్తాయో మనం పసిగట్టలేము. ముఖ్యంగా ఏదైనా రోగం వచ్చిన తరువాత మనం బాధపడే కన్నా రాకుముందే తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. రోగాలు దరిచేకుండా ఉండాలంటే మన శరీరం యొక్క రోగనిరోధకశక్తిని పెంచుకోవాలి. అప్పుడు ఎలాంటి రోగమైన మటుమాయమవుతుంది. రోగ నిరోదక శక్తి పెంచుకునేందుకు అల్లం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
Advertisement
ప్రతిరోజు పరిగడుపున ఒక టీ స్పూన్ అల్లం రసం తాగాలి. అల్లం రసం తాగడం వల్ల అందులో ఉండే యాంటి వైరల్, యాంటి బాక్టీరియల్ గుణాలుంటాయి. వాటి వల్ల వచ్చే వ్యాధులకు అల్లం అడ్డుకట్ట వేస్తుంది. ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ కాకుండా అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. పరిగడుపున అల్లం రసాన్ని తీసుకోవడం ద్వారా జీర్ణసమస్యలు తగ్గుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, వికారం, వాంతులు వంటి వాటి నుంచి సురక్షితంగా బయటపడవచ్చు. వర్షాకాలంలో ప్రధానంగా మన శరీరంపై దాడి చేసేందుకు పలు సూక్ష్మజీవులు సిద్ధంగా ఉంటాయి. వాటన్నింటి నుంచి రక్షించేందుకు అల్లం ఉపయోగపడుతుంది. కాబట్టి అల్లంను ఈ సీజన్‌లో తప్పకుండా తీసుకోవాలి. అల్లం రసం తో పాటు కొంచె తెనే కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించండి.
Also Read :
మీరు చూశారా..? సోషల్ మీడియాలో నటి పవిత్రా లోకేష్ ఫోటోలు వైరల్..!
ప్రేమ వివాహం చేసుకున్న వారే అధికంగా విడిపోవడానికి ప్రధాన కారణాలు అవేనా ?