Home » ఇది తాగితే ఎంత‌టి వారైనా స‌రే బ‌రువు త‌గ్గ‌డం గ్యారెంటీ..!

ఇది తాగితే ఎంత‌టి వారైనా స‌రే బ‌రువు త‌గ్గ‌డం గ్యారెంటీ..!

by Anji

ప్ర‌స్తుతం చాలా మంది ప‌రిమితికి మించి ఆహారాన్ని తీసుకుంటూ.. స‌రైన స‌మ‌యానికి ఆహారం తీసుకోక‌పోవ‌డం వంటి ఎన్నో కార‌ణాల మూలంగా విప‌రీత‌మైన‌ బ‌రువు పెరుగుతున్నారు. బ‌రువు త‌గ్గ‌డానికి వ్యాయామాలు కూడా చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ బ‌రువు మాత్రం త‌గ్గ‌డం లేదు. మ‌రికొంద‌రూ బ‌రువు త‌గ్గాల‌ని మెడిసిన్స్ వాడుతున్నారు. శ‌రీరంలో ఎటువంటి మార్పు రాదు. కానీ బ‌రువు త‌గ్గ‌డానికి సుల‌భ‌మైన మార్గాలున్నాయి. మ‌న పూర్వికులు ఎక్కువ‌గా రాగిజావ‌ను ప్ర‌తిరోజూ తాగేవారు. అందువ‌ల్ల‌నే వారు స్ట్రాంగ్‌గా ఉండేవారు. అదేవిదంగా బ‌రువు కూడా వ‌య‌సుకి త‌గ్గ‌ట్టుగానే ఉండేవారు. ఎటువంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేకుండా పూర్వికులు ఎక్కువ రోజులు బ్ర‌తికేవారు.


ఇప్పుడు కూడా చాలా మంది రాగిజావ‌ను తాగ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. కానీ ఈ రాగిజావ అధిక బ‌రువు ఉన్న వారు సులువుగా బ‌రువు త‌గ్గేవిదంగా చేస్తుంది. ప్ర‌తి రోజు ఉద‌యం వేళ‌లో ఇడ్లీ, దోశ‌,బోండా, పూరి వంటివి టిఫిన్ తీసుకోవ‌డం కంటే రాగి జావా, ఓట్స్‌ను తీసుకోవ‌డం చాలా మంచిది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ప్ర‌తి రోజు ఉద‌యాన్నే రాగిజావ‌తో పాటు ఓట్స్ ను తీసుకుంటే మంచిది. రాగిజావా, ఓట్స్ చేసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. అలాగని నిత్యం తీసుకోవ‌డం కూడా అంత మంచిది కాద‌నే చెప్ప‌వ‌చ్చు. కానీ వారంలో రెండు లేదా మూడు రోజులు తీసుకోవ‌డం బెట‌ర్‌. శ‌రీరానికి కావాల్సిన పోష‌కాలు అందించే ఆహారం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ప్పుడు తీసుకోవ‌డం మంచిది. మూడు పూట‌లా ఉడికించిన ఆహారం తీసుకుంటే శ‌రీరానికి మంచిది. న్యాచుర‌ల్ ఆహారం ద్వారా వ‌చ్చే యాంటి ఆక్సిడెంట్స్, సూక్ష్మ‌పోష‌కాలు ఉడికించిన ఆహారంలో అస‌లు ఉండ‌వు.


రాగి జావ‌, ఓట్స్ మాత్ర‌మే కాకుండా రాగి ఇడ్లీ, రాగి దోశ తీసుకుంటే శరీరానికి కావాల్సిన పొటాషియం, ఫైబ‌ర్‌, విట‌మిన్స్ ల‌భించ‌వు. అందుకే ప్ర‌తిరోజు వీటిని తీసుకోవ‌డం కంటే మొల‌క‌ల‌ను తీసుకోవ‌డం మంచిది. రోజులో ఒక పూట అయినా స‌రే ఉడికించ‌ని ఆహారం తీసుకోవ‌డం బెట‌ర్. రాగిజావ‌, ధాన్యాలు, ప్ర‌తిరోజు తీసుకోవ‌డం క‌న్నా ఎప్పుడైనా తిన‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు తీసుకోవ‌చ్చు. ఇక ఇడ్లీ, దోశ‌ల‌లో ఉండే కార్బోహైడ్రేట్స్ కంటే ఓట్స్, రాగిజావ‌లోనే కార్బోహైడ్రేట్స్ త‌క్కువ‌గా ఉంటాయి. 100 గ్రాముల ఓట్స్ తీసుకోవ‌డం ద్వారా 386 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అదే 100 గ్రాములు రాగిజావ తీసుకుంటే 336 క్యాల‌రీల శ‌క్తి ల‌బిస్తుంది. దీని ద్వారా బ‌రువు కూడా సుల‌భంగా త‌గ్గ‌వ‌చ్చు.

Also Read : 

చిరంజీవి వ‌ల్ల న‌ష్ట‌పోయిన అల్లుఅర్జున్.. ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పిన బ‌న్నీ..!

ఫేస్‌బుక్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌.. మ‌రో కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి..!

Visitors Are Also Reading