Home » చిరంజీవి వ‌ల్ల న‌ష్ట‌పోయిన అల్లుఅర్జున్.. ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పిన బ‌న్నీ..!

చిరంజీవి వ‌ల్ల న‌ష్ట‌పోయిన అల్లుఅర్జున్.. ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పిన బ‌న్నీ..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో. చిరంజీవి పేరు వినిపిస్తే తెలుగు టూ స్టేట్స్ ఫిలిం లవర్స్ ఊగిపోతూ ఉంటారు. సాధారణంగా చిరంజీవి ఎక్కడికైనా వస్తుండని మీడియాలో ప్రకటన క‌నిపిస్తే చాలు.. అభిమానులు ఆయనను చూసేందుకు తమ పనులను సైతం వదిలేసి అక్క‌డికి వెళ్తుంటారు. ఆయన సినిమా విడుదల రోజు థియేటర్లలో జనాలు పోటెత్తుతుంటారు. చిరంజీవి యాక్టింగ్, డాన్స్ కు ఫిదా అవుతుంటారు. ఆయ‌న‌పై ఉన్న‌ అభిమానాన్ని ఇలాగే బయట పెడుతుంటారు.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి ఫిలిం లవర్స్ కో.. కామన్ ఆడియన్స్ కో.. మాత్రమే కాదు.. పలువురు సెలబ్రిటీలకు కూడా.. ప్రస్తుతం టాలీవుడ్ ను శాసిస్తున్న హీరోలు కూడా చిరు సినిమా చూస్తూ ఇలాగే చేస్తుంటారు. బాలీవుడ్, కోలీవుడ్, మల్లువుడ్ , శాండిల్ వుడ్ అని తేడా లేకుండా చాలామంది హీరోలు చిరంజీవి డాన్స్ తో చేసే మ్యాజిక్ గురించి ఆయన బాడీలో ఉన్న గ్రేస్ గురించి వాళ్లు సందర్భాల్లో మాట్లాడారు. తాజాగా చిరంజీవి అల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ డాన్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చిరు డాన్స్ వల్ల తాను లైఫ్ లో ఫస్ట్ టైం డబ్బు పోగొట్టుకున్నానని ఓ ఆసక్తికరమైన విషయాన్నివెల్ల‌డించారు.

Advertisement

చిరంజీవి వ‌ల్ల‌ జీవితంలో ఒకే ఒక్కసారి నష్టపోయాను. రూ.25వేలు పోగొట్టుకున్నాను. చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా విడుదల సమయంలో నాకు నా ఫ్రెండ్ కు మధ్య ఓ చిన్న చర్చ జరిగింది. అందులో చిరంజీవి గారు వీణ స్టెప్ వేసేటప్పుడు ఆయన పక్కన సోనాలి బింద్రే ఉందని మా ఫ్రెండ్ చెప్పాడు. కానీ నేను లేదని చెప్పాను. మేము ఇద్దరం వాదించుకున్నాం. నేను ఇంద్ర సినిమాను దాదాపు 17 సార్లు చూశాను. సోలోగా స్టెప్పు వేశారని నేను మరీ మొండిగానే వాదించాను. వాదించడమే కాదు ఏకంగా రూ.25000 బెట్టు కూడా కట్టాను. ఎవరికి వీడియో చూస్తే చిరు పక్కనే సోనాలి బింద్రే కూడా స్టెప్ వేసింది. నేను కేవలం బ్లాక్ పాయింట్, రెడ్ ష‌ర్ట్ ధరించి ఉన్న మెగాస్టార్ చిరంజీవి వీణ స్టెప్ నే చూశాను. చిరంజీవి ప‌క్క‌నే ఉన్న సోనాలి బింద్రే మాత్రం గుర్తించలేకపోయానని అప్పటి సంఘటనను అల్లు అర్జున్ గుర్తు చేశారు.

Also Read : 

అమితాబ‌చ్చ‌న్-బాల‌కృష్ణ‌ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ మూవీ వాయిదా ప‌డ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

ఫేస్‌బుక్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌.. మ‌రో కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి..!

Visitors Are Also Reading