ప్రస్తుత టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో పనివేళలు, ఆధునిక పోకడలతో లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ బిజీగా గడుపుతున్నారు జనాలు. ఎంతలా అంటే ఇక ప్రశాంతంగా కూర్చొని భోజనం చేయలేనంతగా బిజీగా గడుపుతున్నారు. సమయం లేదనో.. లేటు అవుతుందనో ఇలా చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. కొందరూ మాత్రం గబగబా కానిచ్చేస్తుంటారు. ఎక్కువ శాతం మంది చాలా వేగంగా భోజనం చేస్తుంటారు. కానీ భోజనం వేగంగా చేయకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. త్వరగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
ఫాస్ట్ గా తింటే మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తాం. అంతేకాదు.. శరీరానికి పోషకాలు అందకుండా పోతాయి. ఎక్కువ మోతాదులో తినడం వల్ల విపరీతమైన బరువు పెరిగే అవకాశముంది. దీని ఫలితంగా ఊబకాయం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అందుకే నెమ్మదిగా భోజనం చేయాలని సూచిస్తున్నారు. ఎక్కువగా ఆహారం తింటే జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు రోజు రోజుకు దెబ్బతింటుంది.
Advertisement
Advertisement
వేగంగా భోజనం చేయడం ద్వారా ఇన్సులిన్ నిరోధకత పెరిగి డయాబెటిస్ టైప్ 2 వస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. త్వరగా ఆహారం తినేస్తే గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. కాబట్టి ఆహారానని నెమ్మదిగా నమిలి మింగాలి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆహారం తిన్న తరువాత కనీసం 10 నిమిషాలు నడవాలి. కానీ ఫాస్ట్ గా నడవడం లేదా జాగింగ్ చేయడం వంటివి చేస్తే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం కలుగుతుంది. మీరు బయటికి వెళ్లి వాకింగ్ ఏం చేస్తాం అనుకుంటే ఇంట్లో కూడా నడవవచ్చు. భోజనం చేసిన తరువాత మీకు కడుపు ఉబ్బరంగా ఉంటే వాకింగ్ చేయడం ద్వారా తప్పకుండా ఉపశమనం కలుగుతుంది. ఈ సమస్యల బాధ భరించేకంటే త్వర త్వరగా తినకుండా ఉండడం బెటర్.
Also Read :
ఆడవారు రాత్రిపూట తలస్నానం చేయవచ్చా..? చేస్తే ఏమవుతుందంటే..?
కాళ్లు, చేతులు లేకున్నా ఈ బాలుడి టాలెంట్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!