దోమలతో పోల్చితే ఈగలు అంత ప్రమాదకరం కాదనుకుంటారు చాలా మంది. దోమలు కుడుతాయి కాబట్టి వెంటనే దాని ప్రభావం తెలుస్తుంది. కానీ ఈగలు మాత్రం అలా కాదు.. ఆహార పదార్థాలపై వాలి బ్యాక్టీరియాని అక్కడ దింపుతాయి. అందువల్ల ఆహారం తిన్న తరువాత ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఈగలను మనం లైట్ తీసుకోకూడదు. ఇంటిని శుభ్రం చేసిన తరువాత ఆ చెత్తను ఇంట్లో గానీ, ఇంటి చుట్టుపక్కల గానీ ఉంచకూడదు. వంటగదిలో నేలపై ఎక్కడా ఆహార, పిండి పదార్థాల కింద పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా తీపి పదార్థాలు, ద్రవాలు కింద పడితే ఈగలు వెంటనే వచ్చేస్తాయి.
Also Read : ఆ గొడవ గురించి విశ్వక్ సేన్ ఎందుకు మాట్లాడటం లేదో తెలుసా ?
Advertisement
ఉప్పు కలిపిన నీటిని వేడి చేసి స్ప్రే బాటిల్ లో ఉంచండి. వంటగదిలోని ప్రతిమూలలో ఈ నీటిని చల్లండి. ఉప్పు నీటి స్ప్రేలను ఈగలు తట్టుకోలేవు. మార్కెట్ లలో ఫ్లెట్రాప్స్ లభిస్తాయి. ఇవి జిగురుతో ఉంటాయి. అద్భుతంగా పని చేస్తాయి. ఈగలు ఎగురుతూ ఈ ట్రాప్ కి తగలగానే అంటుకుపోతాయి. అలా ఈగలను వదిలించుకోవచ్చు. ఆహారం, పిండి వంటలను ఓపెన్ గా ఉంచవద్దు. బంధువులకు వాటిని ఇచ్చినప్పుడు ఈగలు లేని ప్రదేశంలో వారిని కూర్చొబెట్టే ఇవ్వండి. వీలైనంత వరకు కిటికీలు తలుపులు తెరవకుండా ఉండటం మేలు.
Advertisement
Also Read : ఉగాది రోజు గుమ్మానికి ఇది కడితే ఈ ఏడాది అంతా ధనానికి లోటుండదు..!
ఈగలను తరిమికొట్టడానికి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ పంచదారను ఒక గ్లాస్ పాలలో వేసి కాసేపు వేడి చేసి ఆ మిశ్రమాన్ని వంటగదిలో ఓ మూలలో ఉంచండి. ఈ పాల మిశ్రమం నుంచి వచ్చే వాసన వల్ల వంటగదిలోకి ఈగలు రావు. వెనిగర్ తో ఈగలు నశించగలవు. వెనిగర్ వాసన ఈగల్ని ఆకర్షిస్తుంది. కంటైనర్ లో కొంచెం వెనిగర్ ఉంచండి. కంటైనర్ లో కొంచెం వెనిగర్ ఉంచండి. కంటైనర్ ను ప్లాస్టిక్ ర్యాప్ లో చుట్టండి. ఈగలు లోపలికి వెళ్లేందుకు సంచికి చిన్న చిన్న రంద్రాలు చేయండి. లోపలికి వెళ్లే ఈగలు బయటికి అంత తేలికగా బయటకి రాలేవు. ఈగలు, దోమలు, బొద్దింకలు చేరకుండా ఇన్ సెక్టిసైడ్స్ మార్కెట్ లో లభిస్తాయి. వీటిని ఇంటి మూలలో అక్కడక్కడా వాడవచ్చు. అయితే వీటిని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పిల్లలుంటే వీటిని వాడకపోవడం మేలు.
Also Read : టీమిండియాలో నో ఛాన్స్.. ఇక సీరియల్లో నటిస్తున్న శిఖర్ ధావన్!