Home » అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తే బరువు తగ్గిపోతారు..!

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తే బరువు తగ్గిపోతారు..!

by Anji
Published: Last Updated on

సాధారణంగా చాలా మంది బరువు పెరగడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గాలని అందరూ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పెరిగిన బరువు, కొవ్వు ఎలా తగ్గుతుందో అర్థం కావడం లేదు. మీరు కూడా మీ పెరుగుతున్న బరువు వల్ల ఇబ్బంది పడుతుంటే.. మీరు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతే, చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 5 సూత్రాలను పాటిస్తే బరువు ఇట్టే తగ్గిపోతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీరు వీటిని పాటించండి. ఫలితం గ్యారెంటీ ఉంటుంది.

  • ఉదయం త్వరగా నిద్రలేచినప్పుడు శక్తి పెరుగుతుంది, జీవక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, సంతోషంగా ఉంటారు, రోజు పనిని సమయానికి పూర్తి చేస్తారు. ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • ఉదయం నిద్రలేచి పళ్లు తోముకున్న తర్వాత టీకి ముందు గోరువెచ్చని నీటిని తాగండి. డిటాక్స్ వాటర్ తాగితే అది ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఒక చెంచా తేనె కలపండి. ఈ నీరు శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా జీవక్రియను కూడా పెంచుతుంది.
  • డిటాక్స్ వాటర్ తాగిన తర్వాత, ప్రతి ఉదయం సూర్యరశ్మి తగిలేలా కూర్చోవాలి. ఇది శరీరానికి విటమిన్ డిని అందిస్తుంది, ఇది జీవక్రియను పెంచుతుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. దీని వలన ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. రోజంతా సంతోషంగా ఉంటారు.

 

  • చాలా మంది ఉదయాన్నే ధ్యానం చేయలేరు. అయితే బ్రష్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు ధ్యానం చేయాలని ఒక నియమం పెట్టుకోండి. ధ్యానం మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. ధ్యానం తర్వాత, ప్రతిరోజూ అరగంట పాటు నడవండి. రోజూ వాకింగ్ చేయడం వల్ల బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.
  • ఉదయం పూట పూర్తిగా అల్పాహారం తీసుకోవాలి. ఉదయం 7 నుండి 9 గంటల మధ్య అల్పాహారం తీసుకోవడానికి ఉత్తమ సమయం. అలాగే, అల్పాహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులకు బదులుగా, గుడ్లు, చికెన్, డ్రై ఫ్రూట్స్, ఓట్స్ వంటి ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోండి. అల్పాహారంలో పండ్లను కూడా చేర్చండి.

 

Visitors Are Also Reading