Home » పొరపాటున కూడా ఈ తప్పులను అస్సలు చేయకండి.. లేదంటే మీ మొబైల్ హ్యాక్ అవుతుంది..!

పొరపాటున కూడా ఈ తప్పులను అస్సలు చేయకండి.. లేదంటే మీ మొబైల్ హ్యాక్ అవుతుంది..!

by Anji
Ad

మొబైల్ ఫోన్ ఇప్పుడు వ్యక్తి జీవితం కంటే కూడా ఇది ముఖ్యం అయిపోతుంది. చేతిలో ఫోన్ లేనిదే అడుగు కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లల నుంచి మొదలు ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్ ని ఏదో ఒక రకంగా వినియోగిస్తూనే ఉంటారు. ఉదయం లేచినప్పుడు ప్రారంభమై.. రాత్రి పడుకునే వరకు ఆపరేట్ చేయడమే కాకుండా పడుకున్న తరువాత కూడా తలగడ పక్కనే మొబైల్ పెట్టుకొని నిద్రిస్తుంటారు.

Advertisement

 కొంతమంది కాల్స్ చేస్తారు. కొందరూ ఫోన్స్ మాట్లాడుతారు.  కొందరూ మ్యూజిక్ వింటారు. మరికొందరూ వీడియోలు చూస్తారు. వ్యక్తిగత పనులను సైతం చేస్తారు. బ్యాంకింగ్ టెక్నికల్ వర్క్స్, ప్రభుత్వ పనులు ఇలా ఒక్కటేమిటి.. సమస్తం ఫోన్ ద్వారానే చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రజలు అవసరాలు, వినియోగాలను ఆసరాగా చేసుకొని అడ్డదారుల్లో డబ్బు సంపాదించే కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వారే హ్యాకర్స్. అవును, ఫోన్ వినియోగదారులు ఏమాత్రం పొరపాటు చేసినా హ్యాకర్ల చేతిలో అడ్డంగా బుక్ అయిపోతారు. అందుకే ఫోన్ వినియోగదారులు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

  1. మీకు తెలియని లింక్  మీ మొబైల్ కి వస్తే.. అస్సలు క్లిక్ చేయకూడదు. ఒకవేళ క్లిక్ చేస్తే మీ మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదముంది. తొలుత ఈ లింక్ నిజమైందో కాదో వెరిఫై చేసుకోవాలి. 
  2. ఈ-మెయిల్ ద్వారా టెక్ట్స్ మెసేజ్ ద్వారా గానీ, ఇతర ఏ మార్గం ద్వారానైనా కేవైసీ చేయాలంటూ మెసేజ్ వచ్చినట్టయితే దానిపై క్లిక్ చేయకూడదు. దృవీకరణ లేకుండా ఏ సమాచారాన్ని ఇవ్వకూడదు. గుడ్డిగా నమ్మి మీ సమాచారం అంతా ఇచ్చేస్తే.. అడ్డంగా బుక్ అయిపోతారు. మీ అకౌంట్ లో డబ్బు అంతా ఖాళీ అయిపోతుంది. 
  3. లాటరీ అని, లోన్ అని, క్రెడిట్ కార్డు ఆఫర్ అని మెసేజ్ లు వచ్చినా వాటిని పట్టించుకోవద్దు. పొరపాటున వాటిని క్లిక్ చేయకూడదు. లేదంటే మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశముంది. 
  4. మీరు గూగుల్ లో చెక్ చేసినప్పుడు అనేక వెబ్ సైట్ లు మీ అనుమతి అడుగుతాయి. ఏ వెబ్ సైట్ కి అనుమతి ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో అవగాహన తప్పకుండా కలిగి ఉండాలి. అన్నింటికీ అనుమతి ఇవ్వడం వల్ల మీ సమాచారం చోరీ అయ్యే అవకాశం ఉంది. నకిలీ వెబ్ సైట్స్ కూడా ఉంటాయి. మీరు నిజమని నమ్మి అన్నింటికీ అనుమతి ఇస్తే.. మీ అకౌంట్ లో డబ్బు సహా, మీ పర్సన్ ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆ రోజుల్లోనే రజినీకాంత్ జీవితాన్ని నిలబెట్టే సాయాన్ని శరత్ బాబు చేశాడనే విషయం మీకు తెలుసా ?

 మోహన్ బాబుని దారుణంగా అవమానించిన మ్యూజిక్ డైరెక్టర్.. ఎవరంటే..!!

Visitors Are Also Reading