Home » ఈ సెంటిమెంట్ నిజమైతే ‘ఆచార్య’ సినిమా కూడా అలాగే అవుతుందా ? మెగా ఫాన్స్ ని భయపెడుతున్న లాజిక్ ఇదే !

ఈ సెంటిమెంట్ నిజమైతే ‘ఆచార్య’ సినిమా కూడా అలాగే అవుతుందా ? మెగా ఫాన్స్ ని భయపెడుతున్న లాజిక్ ఇదే !

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ మరియు రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కొరటాల శివ డైరెక్షన్ లో నిర్మించిన ఈ మూవీ ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా చేస్తున్నారు.

Advertisement

 

ఈ ప్రమోషన్లలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఇంటర్వ్యూ లో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. అలాగే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య షూటింగ్ లొకేషన్ లో జరిగినటువంటి ఒక ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement

ఈ వీడియోలో హీరో రామ్ చరణ్ షూటింగ్లో ఉన్నప్పుడు కొన్ని మూగజీవాలను ప్రేమగా దగ్గరికి తీర్చుకొని వాటికి కావలసిన ఆహార పదార్థాలు ఇస్తున్నాడు . దీన్ని బట్టి చూస్తే మూగజీవాల అంటే రామ్ చరణ్ కి ఎంత ప్రేమో అనేది మనకు అర్థం అవుతుంది. రామ్ చరణ్ అలా మూగ జీవాలను అక్కున చేర్చుకోవడాన్ని చిరంజీవి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు. అయితే ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కామెంట్లలో ఒక నెటిజన్ బ్రో సినిమా ఎత్తి పోతుంది..

నీకు డ్యామేజ్ పిక్స్ అంటూ కామెంట్ పెట్టారు. అయితే అన్ని నెటిజన్ ఆ కామెంట్ చేయడానికి ప్రధాన కారణం కూడా ఉందని కొంతమంది భావిస్తున్నారు. రాజమౌళికి ఒక సెంటిమెంట్ ఉంది ఆయన డైరెక్షన్ లో ఏ హీరో చేసిన బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఆ మూవీ తర్వాత ఏ సినిమా చేసినా డిజాస్టర్ గా నిలుస్తుందని మనం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. అయితే ఆచార్య సినిమాలో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Visitors Are Also Reading