Home » శీతాకాలంలో బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా పెరుగుతుంది.. ఈ మార్పులతో అరికట్టవచ్చు..!

శీతాకాలంలో బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా పెరుగుతుంది.. ఈ మార్పులతో అరికట్టవచ్చు..!

by Anji
Ad

చలికాలం వచ్చిందంటే కుటుంబంలోని చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు అందరూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతుంటారు. ఏడాది పొడవునా యాంటిడిప్రెసెంట్స్ తీసుకునే వారు కూడా ఈ సీజన్ లో వ్యాధులతో పోరాడవలసి ఉంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రత పడిపోవడంతో శరీరంలోని సిరలు, ధమనులు కుంచించుకుపోతాయి. శరీర ఉష్ణోగ్రత, రక్తప్రసరణను నిర్వహించడానికి శరీరం అదనపు శక్తిని ఉపయోగించవలసి ఉంటుంది. ఫలితంగా రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వెచ్చని బట్టలు ధరించడం, యోగా చేయడం వంటి చిన్న చిన్న జీవనశైలి మార్పలు చేయడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా తినడం, తాగడం వంటి ఆహార అలవాట్ల ద్వారా కూడా అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఫలితంగా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement


మెంతి గింజలు లేదా మెంతి ఆకుకూరలు శీతాకాలంలో ఏది తిన్నా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మెంతికూరలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ప్రతిరోజూ ఈ కూరగాయలను కూర లేదా జ్యూస్ ఏ విధంగా తీసుకున్నా కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది. నాడీ వ్యవస్థ కూడా చురుకుగా పనిచేస్తుంది. బీట్ రూట్ దుంపలోని యాంటీ ఆక్సిడెంట్, బి విటమిన్లు అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అంతేకాకుండా దుంపలు తినడం ద్వారా ఉత్పత్తి అయ్యే నైట్రిక్ ఆక్సైడ్ శరీరంలో రక్త ప్రసరణను నిర్వహిస్తుంది.

Advertisement


శీతాకాలంలో ఆరెంజ్ పండ్లు అధికంగా పండుతాయి. ఆరెంజ్ పండ్లు తినడం ద్వారా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ పండులో ఉండే మెగ్నీషియం, విటమిన్ B6 రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ముల్లంగి తినడం వల్ల కడుపులో గ్యాస్ వస్తుందని చాలా మంది భయపడుతుంటారు. ముల్లంగి తినడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ శీతాకాలపు కూరగాయ రక్తపోటును తగ్గించడంలో, శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది. ఈ సీజన్ లో లభించే పాలకూర, క్యాబేజీ వంటి శీతాకాలపు కూరగాయలు రక్తపోటును తగ్గించడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఉపయోగపడతాయి.

ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading