Home » 29 రోజుల్లో సినిమా పూర్తి చేస్తే 512 రోజులు ఆడిన సినిమా.. ఏంటో తెలుసా..?

29 రోజుల్లో సినిమా పూర్తి చేస్తే 512 రోజులు ఆడిన సినిమా.. ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇంట్లో భార్య అంటే విపరీతమైన అభిమానం కనబరుస్తూ, బయటకు వెళ్ళగానే పరాయి స్త్రీల కోసం వెంపర్లాడే మగవారినే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటారు. ఈ నానుడి ని బేస్ చేసుకొని అదే టైటిల్ తో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా వచ్చి ఇప్పటికి దాదాపు 40 సంవత్సరాలు పూర్తయింది. ముందుగా ఈ సినిమా థియేటర్ లోకి వచ్చి యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత క్రమంగా పుంజుకొని ప్రేక్షకాదరణ పొంది సూపర్ హిట్ అయింది.

Advertisement

ఏకంగా 512 రోజులు ఆడి సూపర్ హిట్ సినిమాగా నిలిచిపోయింది. అప్పటికే యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవిని ఫ్యామిలీ క్యారెక్టర్ లో చూపించి మెప్పించడం అంత ఈజీ విషయం అయితే కాదు. ఆయన సినీ జీవితంలోనే ముందు వరుసలో ఉంటుంది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. చిరంజీవి సరసన జయ పాత్రలో మాధవి నటించింది. చిట్టి తల్లి అనే పాత్రలో పూర్ణిమ నటించింది. ఈ చిత్రం ద్వారానే గొల్లపూడి మారుతీ రావు నటుడిగా పరిచయం అయ్యారు.

Advertisement

కానీ ప్రస్తుత రోజుల్లో ఒక సినిమా షూటింగు అంటే వంద రోజులు కూడా చాలడం లేదు. ఒక్కో సినిమాకి 150 నుంచి 200 రోజులు పడుతోంది. ఇలాంటిది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీ ని మాత్రం కేవలం 29 రోజుల్లోనే పూర్తి చేసి చూపించారు దర్శకుడు. ఈ చిత్రానికి మూడు లక్షల 20 వేల రూపాయల బడ్జెట్. ఈ చిత్రం పాలకొల్లు, పోడూరు, నరసాపురం, సఖినేటిపల్లి, భీమవరం,మద్రాసులో షూటింగ్ పూర్తి చేశారు. ఈ విధంగా సినిమా రిలీజ్ 500 రోజులుకు పైగా ఆడి థియేటర్లలో రికార్డు సృష్టించింది.

ALS0 READ:

Visitors Are Also Reading