టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ మధ్యలో పూరి ఏ రేంజ్‌లో సినిమాలు తీసి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. 2006 ఏప్రిల్ 28న పోకిరి సినిమా విడుదల అయింది. ఈ చిత్రం అప్పట్లో వసూళ్ల పరంగా తెలుగు సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. రూ.10కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం రూ.70కోట్ల గ్రాస్‌తో రూ.40 కోట్ల షేర్ సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అటు హీరోగా మహేష్‌బాబు స్థాయిని, దర్శకునిగా పూరిజగన్నాథ్ స్థాయిని పెంచిన సినిమా పోకిరి అనే చెప్పొచ్చు.
Advertisement
పోకిరి చిత్రంలో ముఖ్యంగా క్లైమాక్స్‌లోని ట్విస్ట్ వల్లనే ప్రేక్షకులు పోకిరి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసారు. అయితే క్లైమాక్స్ మరొక విధంగా ఉండి ఉంటే మాత్రం పోకిరి ఆ స్థాయిలో హిట్ అయ్యేది కాదని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు ఏ సీన్లు అవసరమో ఆ సీన్లు మాత్రమే తీసేవారని ఒక ఫిల్మ్ క్యాన్ కొనాలంటే 10వేల రూపాయలు కావడంతో నిర్మాతలు బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్త పడ్డారట. ప్రస్తుతం డిజిటల్ రావడంతో ప్రతి షాట్ ఫుల్ షాట్ తీస్తున్నారని టాక్. ముఖ్యంగా సినిమాకు ఆ సీన్లు అవసరమా..? కాదా అని కూడా ఆలోచించకుండా కెమెరాలు పెట్టి ప్రస్తుతం సినిమాలు తీస్తున్నారు.
Advertisement
పోకిరి సినిమా సమయంలో ఎడిటింగ్ రూమ్‌లో డైరెక్టర్ తప్ప వేరే ఎవరు కూడా ఇన్వాల్‌మెంట్ ఉండేది కాదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మార్తాండ్ కే వెంకటేష్ చెప్పారు. ఫ్లోకు అడ్డం అయితే పాటలను కూడా తీసేస్తామని.. అదేవిధంగా పోకిరి క్లైమాక్స్ ఏకంగా 17 నిమిషాలు వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇక క్లైమాక్స్ ను 7 నిమిషాలకు కుదించినట్టు సీజీ షాట్లు సరిగ్గా రాకపోవడంతో అలా చేసామని హీరో ఆర్టిఫిషియల్ గా కనిపించే సన్నివేశాలను తొలగించాం అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న క్లైమాక్స్ చాలా బాగుందని.. ఒకవేళ క్లైమాక్స్‌ను సాగదీసి ఉంటే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది కాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో పోకిరి సినిమా బిగ్ హిట్ అనే చెప్పాలి.
Also Read :
హర్ష సాయికి అసలు అన్ని డబ్బులు ఎక్కడివి..? ఇతను ఏం చేస్తాడు..?
విమానంలో ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు…పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్….!