ప్రభాస్‌ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది పెద్దనాన్న కృష్ణంరాజు అనే విషయం అందరికీ తెలిసిందే. పెద్దనాన్న పరిచయం చేసినప్పటి నుంచి ప్రారంభంలో కాస్త తడబడ్డా ఆ తరువాత దూసుకెళ్లి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ముఖ్యంగా బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు ప్రభాస్. బాహుబలి హిట్ అయిన సందర్భంలో సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ప్రభాస్ ని పరిచయం చేశారు.
ఇక ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని పెద్దనాన్న ఆశపడ్డారు. ఇటీవలే ప్రభాస్-కృష్ణంరాజులు కలిసి రాధేశ్యామ్ సినిమాలో నటించారు. అంతకు ముందు బిల్లా, రెబల్ సినిమాల్లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు మాట్లాడుతూ మన ఊరి పాండవులు సినిమా ప్రభాస్ చేస్తే చూడాలని ఉందని చెప్పుకొచ్చారు. ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావనరాగానే ప్రభాస్‌కి పెళ్లి జరిగి పిల్లలు పుడితే ఎత్తుకుని ఆడించాలని ఉందని చెప్పుకొచ్చారు. కానీ ఆశ తీరకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు.
Advertisement
Advertisement
కృష్ణంరాజు ఆసుపత్రిలో ఉండగానే గత శనివారం ప్రభాస్ పలుకరించి వచ్చారు. తన పెద్దనాన్న కృష్ణంరాజు మరణించడంతో ఒక్కసారిగా ప్రభాస్ కన్నీటి పర్వంతమయ్యాడు. కృష్ణంరాజు మరణ వార్త తెలుసుకొని పలువురు సినీ ప్రముఖులు, మంత్రులు, రాజకీయ నేతలు జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి తరలివచ్చి భౌతికఖాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా వేర్వేరుగా ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి : KRISHNAM RAJU : తనకు తానే శిక్ష వేసుకున్న రెబల్ స్టార్.. ఎందుకో తెలుసా..?.. ఎందుకో తెలుసా..?