Home » అరటి ఆకులో భోజనం ఎందుకు చేస్తారంటే.. దీనిలో ఉండే ఆ శక్తి మనకి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే మీరు విడిచిపెట్టరు..!!

అరటి ఆకులో భోజనం ఎందుకు చేస్తారంటే.. దీనిలో ఉండే ఆ శక్తి మనకి ఎంత మేలు చేస్తుందో తెలిస్తే మీరు విడిచిపెట్టరు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకు పూర్వ కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. మన పెద్దలు ఏది చేసినా దాని వెనుక ఏదో ఒక సైన్స్ రహస్యం దాగి ఉంది అంటారు. అదేవిధంగా అరటి ఆకులో భోజనం చేయడం వెనుక కూడా అనేక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..ప్రస్తుత కాలంలో విందు భోజనాలు పెడితే ప్లాస్టిక్, కాగితం ప్లేట్లను వాడుతున్నారు. పూర్వం ఇవి లేని రోజుల్లో అరటి ఆకులో మాత్రమే భోజనం చేసేవారు.

Advertisement

 

also read:భార్య‌, భ‌ర్త‌లు పిల్ల‌ల ముందే గొడ‌వ ప‌డుతున్నారా..? అయితే ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి.!

అరిటాకులో పెట్టిన కమ్మని ఆహారపదార్థాలు చూడగానే తినకుండానే కడుపు నిండిన భావన మనలో చాలామందికి కలిగి ఉండవచ్చు. అరటి ఆకుల్లో ఎక్కువగా పాలీఫినాల్స్ ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. వేడి వేడి ఆహార పదార్థాలు పెట్టగానే ఆకుపై పొరలో ఉండే పాలీఫినాల్స్ భోజనంలో కలిసిపోతాయి. దీని వల్ల శరీరానికి పోషక పదార్థాలు అందడమే కాకుండా మనం తీసుకునే ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది.

Advertisement

అరటి పండులో ఉన్నట్టే అరటి ఆకులో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పుకొనేది అరటి ఆకుకు విషాన్ని గ్రహించే శక్తి కూడా ఉంటుందట. భోజనంలో ఉండే విష పదార్థాలను గ్రహించి అరటి ఆకు వెంటనే నల్లగా మారుతుందట. దీనివల్ల భోజనం చేసే వారికి ఫుడ్ పాయిజన్ కాకుండా ఉంటుంది. అలాగే అరటి ఆకులు తినడం వల్ల గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

also read:టాలీవుడ్ నంబ‌ర్ 1 హీరో ప్ర‌భాస్..! హీరోయిన్ ఎవ‌రంటే..?

Visitors Are Also Reading