తెలుగు ఇండస్ట్రీ లోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక మంచి పేరును సంపాదించుకున్నారు. తాతకు తగ్గ మనవడిగా పేరును సంపాదించారు. ఆర్ఆర్ఆర్ మూవీ తో పాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది. ఈ తరుణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో తాతయ్య తో ఉన్నటువంటి సంబంధం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. అవేంటో ఒకసారి చూద్దాం..? ఆయన 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తాత గారిని మొదటిసారిగా డైరెక్టుగా చూశానని ఎన్టీఆర్ అన్నారు. ఆ సమయంలో నేను ఒక్కడిని మాత్రమే తాత గారిని కలవడానికి వెళ్లాను అని తెలియజేశారు. ఆయన కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారని నన్ను చూడగానే రండి అని పిలిచారని తారక్ అన్నారు. మా నాన్న హరికృష్ణ మా అందరికీ రామ్ అని పేరు కలిసేలా పేరు పెట్టారని తెలియజేశారు.
Advertisement
ఆ సందర్భంలోనే తాతయ్య నా పేరును తారక రామారావు గా చేంజ్ చేశారని తారక్ అన్నారు. నన్ను బంగారంలా చూసుకునేవాడని తెలియజేశారు. తర్వాత తాతయ్య అమ్మని కూడా పిలిపించారని, అమ్మ ఏ వంట చేసినా చాలా బ్రహ్మాండంగా వండుతుందని ఆయన అనేవారని చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఇంత కాలం మీకు దూరంగా ఉన్నామనే విషయాలు పట్టించుకోవద్దని తాతయ్య అమ్మతో అన్నారని తారక్ అన్నారు. తర్వాత కొద్ది రోజులకు తాతయ్య మరణించారని తెలియజేశారు. తాతయ్య నాకు ఎన్టీఆర్ అనే పేరు ఇస్తే, నాన్న హరికృష్ణ మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నారని, ఆయన గొప్ప తండ్రి అని చెప్పారు.
Advertisement
అలాంటి ఆయన కడుపులో పుట్టడం మా అదృష్టం అని తారక్ తెలియజేశారు. నాకు ఒక స్టార్డమ్ వచ్చేవరకు ఆయన నన్ను పరిచయం చేయలేదు. దానికి ప్రధాన కారణం పరిచయం చేసే సందర్భం రాలేదని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. బాబాయ్ బాలయ్య నాతో ఎలా ఉంటారో నాకు తెలుసు అని అన్నారు. ఒకవేళ నేను హీరోగా సక్సెస్ కాకపోయి ఉంటే, బిజినెస్ లో సక్సెస్ అయి ఉంటే కూడా నందమూరి ఫ్యామిలీకి దగ్గరయ్యే వాడినని, మా మధ్య కల్మషాలు అనేవి తొలిగిపోయి కలిసిపోయి ఉండడానికి టైం పట్టేదాని, కానీ ఎప్పటికైనా మేము అంతా కలిసే వాళ్ళం అని తారక్ తెలియజేశారు. అమ్మ నాకు చాలా స్వేచ్ఛను ఇచ్చిందని తారక్ అన్నారు.
ALSO READ;
రాజశేఖర్ కూతురి కోసం సహాయం అడగటానికి చిరు ఇంటికి వెళితే ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా ?
నయనతార విఘ్నేష్ శివన్ జంట హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్లారో తెలుసా..?