Telugu News » Blog » రాజశేఖర్ కూతురి కోసం సహాయం అడగటానికి చిరు ఇంటికి వెళితే ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా ?

రాజశేఖర్ కూతురి కోసం సహాయం అడగటానికి చిరు ఇంటికి వెళితే ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా ?

by AJAY
Ads

ఏ రంగంలో అయినా మ‌నుషుల మ‌ధ్య‌న మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డం ఆ త‌ర‌వాత మళ్లీ కలిసిపోవ‌డం కామ‌న్. ఈ లోకంలో ఏదీ కూడా శాశ్వ‌తం కాదు. ఇక సినిమా ఇండ‌స్ట్రీలోనూ కొంద‌రి మ‌ధ్య అనేక‌కార‌ణాల వ‌ల్ల మ‌నస్ప‌ర్ద‌లు ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే హీరో రాజ‌శేఖ‌ర్, చిరంజీవి మ‌ధ్య‌లో మ‌నస్ప‌ర్ద‌లు ఉండేవి. కానీ వారిద్ద‌రూ క‌లిసి పోయారు. అంతే కాకుండా రాజ‌శేఖ‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలను బ‌య‌ట‌పెట్టారు.

Also Read: ఉదయ్ కిరణ్ నటించిన హిట్ ఫ్లాప్ సినిమాల కలెక్షన్స్ !

హుదుద్ తుఫాన్ త‌ర‌వాత ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మంలో స‌మ‌యంలో తాను చిరంజీవి క‌లుసుకున్నామ‌ని అన్నారు. ఆ త‌ర‌వాత చాలా ఫంక్ష‌న్స్ లో కూడా అలాగే క‌లుసుకున్నామ‌ని చెప్పారు. కానీ హాయ్ బాయ్ చెప్పుకోవ‌డ వ‌ర‌కే ఉండేద‌ని అన్నారు. ఒక‌సారి సుబ్బిరామిరెడ్డి ఇంట్లో డిన్న‌ర్ జరిగింద‌ని ఆ డిన్న‌ర్ కు ఇద్ద‌రం హాజ‌రయ్యామ‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో గ‌తంలో అన్నివిష‌యాలు మాట్లాడుకున్నామ‌ని చెప్పారు.

Also Read:  1998లో పరీక్ష రాస్తే.. రిటైర్మెంట్ ఏజ్ లో జాబ్ వచ్చింది..!

ఒక‌సారి జీవిత కూతురు శివాని మెడిక‌ల్ కాలేజీలో సీట్ కోసం వెళ్లింద‌ని చెప్పారు. చిరు స‌పోర్ట్ కోసం ఇంటికి వెళితే జీవిత‌ను చిరంజీవి చాలా భాగా రిసీవ్ చేసుకున్నార‌ని తెలిపారు. మీరు ఒక్క‌రే వ‌చ్చారా రాజ‌శేఖ‌ర్ రాలేదా అంటూ అడిగార‌ని అన్నారు. దాంతో జీవిత చిరంజీవి అడుగున్నారు మీరు కూడా రావాలంటూ త‌న‌కు ఫోన్ చేసింద‌ని చెప్పారు.

దాంతో తాను కూడా జీవిత‌తో క‌లిసి మ‌ళ్లీ చిరంజీవి ఇంటికి వెళ్లాన‌ని చెప్పారు. అప్పుడు జ‌రిగింది ఏదో జ‌రిగిపోయింది అదంతా మ‌ర్చిపోదామ‌ని అనుకున్న‌ట్టు తెలిపారు. ఆ స‌మ‌యంలో ధృవ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అర‌వింద్ స్వామి క్యారెక్ట‌ర్ లు బాగున్నాయ‌ని చెప్పాన‌ని అన్నారు.

Also Read: న‌య‌న‌తార విఘ్నేష్ శివ‌న్ జంట‌ హ‌నీమూన్ కోసం ఎక్క‌డికి వెళ్లారో తెలుసా..?


You may also like