సాధారణంగా ఈ సమాజంలో ఉండే ఆడవారు ఎక్కువ వరకు చాలా సున్నిత మనస్కులే ఉంటారు.. ఆడవారు మగవారిపై ప్రేమను పెంచుకుంది అంటే అతన్ని ఎంతగానో నమ్ముతుంది.. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న ఆడవాళ్లు అయితే తన భర్తే తనకు సర్వస్వమని భావిస్తూ ఉంటారు.. ఆ విధంగానే భర్త తనని మాత్రమే చూడాలని, తనని మాత్రమే ప్రేమించాలని భావిస్తారు..
Advertisement
ఈ విధంగా భర్త అంటే చచ్చేంత ప్రేమను పెంచుకుంటారు.. ఆ విధంగా ప్రేమను చూపించే ఆడవారికి మగవారిలో ఈ అలవాట్లు అస్సలు నచ్చవట.. ఈ అలవాటు ఉండటం వల్ల మీ మధ్య ఉండే రిలేషన్స్ దూరమవుతాయని అంటుంటారు. ఈ అలవాట్ల వల్ల జీవిత భాగస్వామి పట్ల ఇష్టాన్ని కోల్పోతారట. మరి స్త్రీలు అస్సలు తట్టుకోలేని పురుషుల అలవాట్లు ఏమిటో చూద్దాం..
Advertisement
1. మహిళా భాగస్వామి తో ఆధిపత్యం చెలాయించేలా పురుషులు మాట్లాడడం ఆడవారికి నచ్చదు.
2. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించని పురుషులను ఆడవారు అస్సలు ఇష్టపడరు.
3. తన జీవిత భాగస్వామితో తప్ప ఇతర అమ్మాయిలతో సరసాలాడే అబ్బాయిలంటే అమ్మాయిలకు నచ్చదు.
4. అలాగే తరచూ అబద్ధాలు చెప్పే మగవారంటే ఇష్టం ఉండదు.. దీనివల్ల మీ జీవిత భాగస్వామి మీపై నమ్మకాన్ని కోల్పోతుంది.
5. అలాగే కొంతమంది భర్తలు భార్యలను తరచూ కోపానికి వస్తూ ఉంటారు.. అలాంటి వారు ఉంటే కూడా వారికి నచ్చదని అంటుంటారు.
6. దీంతోపాటుగా మద్యం, సిగరెట్ లాంటివి తరచు తీసుకునే వారు అంటే కూడా మహిళలకు నచ్చదని, దీని ద్వారా ఇబ్బందిగా ఫీలవుతుంటారని కాబట్టి ఈ అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు.
ALSO READ:
- టాలీవుడ్ లోని ఈ హీరోల హైట్ ఎంతో మీకు తెలుసా..?
- పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడా..? కారణం ఏమిటంటే..?