సాధారణంగా వాస్తుశాస్త్రం అనేది చాలా పురాతనమైంది. వాస్తవానికి ఇది ఒక రకమైన ఇంజినీరింగ్ లాంటిది ఏది ఎలా ఉండాలనేది వాస్తు శాస్త్రం చెబుతుంది. అలా ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతుంది. ఇంట్లోకి ధనలక్ష్మీ రావాలంటే పాటించిన 7 నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మీ ఇంటి యొక్క ఎంట్రన్స్ తప్పని సరిగా తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశవైపునకు ఉండాలి. ఈ దిక్కులను మంచివిగా చెబుతారు. అటువైపు నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అటు ఎంట్రన్స్ ఉంటే ధనలక్ష్మి ఇంట్లోకి వస్తుంది.
మీ ఇంటి యొక్క ఎంట్రన్స్ తప్పనిసరిగా అందంగా ఉండాలి. చక్కగా అలంకరించినట్టు ఉండాలి. మెరిసే రంగులతో ఉండాలి. కాంతి బాగా ఉండాలి. మెరిసే రంగులతో ఉండాలి. కాంతి బాగా ఉండాలి. చీకటి రంగులు వాడొద్దు. ఎంట్రన్స్ దగ్గర సరిగ్గా కాంతి లేకపోతే లక్ష్మీదేవి రాదు. ఆమెకు బదులు దరిద్ర దేవత వస్తుంది.
మీ ఇంటి ప్రధాన తలుపు.. ఇంట్లోని మిగతా అన్ని తలుపుల కంటే కొద్దిగా పెద్దగా ఉండాలి. ఆ తలుపును లోపలి నుంచి తెరిచేవిధంగా ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది.
Advertisement
ఇంటి గడప బాగుంటేనే లక్ష్మీదేవత గడప దాటుతుంది. మరీ ఎక్కువ ఎత్తు ఉండకూడదు. గడపను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ తేలికగావచ్చేవిధంగా ఉండాలి. లక్ష్మీదేవి లోపలికి అడుగుపెడుతుంది.
Also Read : శివుడి జన్మ ఎలా జరిగింది.. తల్లిదండ్రులు ఎవరు ?
ఇంటి ప్రధాన ద్వారం ముందు తప్పనిసరిగ్గా అందమైన ముగ్గు ఉండాలి. అమ్మవారికి సంప్రదాయ ముగ్గులు అంటే చాలా ఇష్టం. ఆ ముగ్గుతోనే అమ్మవారికి దయ, జాలి కలుగుతాయి.
ఎలాంటి పరిస్థితిలో కూడా ఇంటి ముందు ప్రధాన తలుపులకు అద్దాలు, గ్లాస్ లు వంటివి లేకుండా చూసుకోండి. వాటిపై పడే కాంతి ప్రతిక్షేపణం చెందుతుంది. అలా ప్రతిక్షేపణం చెందడం తల్లికి నచ్చదు. లక్ష్మీదేవతకి బదులు దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. ఈ నియమాలను పాటించినప్పుడు లక్ష్మీదేవి రాక మీకు అర్థమవుతుంది. మీ ఇంట్లో వరుసగా శుభవార్తలు వినిపిస్తుంటాయి. అందరికీ ఇంట్లో ఆరోగ్యం మెరుగు అవుతుంది.
Also Read : నోటి దుర్వాసనను నివారించడానికి ఈ చిట్కాలను తప్పక పాటించండి..!