ఐసీసీ మహిళల ప్రపంచ కప్-2022 వెస్టిండీస్ ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఇప్పుడు డిఫెడింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను కూడా మట్టికరిపించింది. ఇంగ్లండ్ జట్టు విజయానికి 226 పరుగులు చేయాల్సి ఉంది. కానీ 47.4 ఓవర్లలో ఆలౌట్ అయింది. చివరి ఓవర్‌లో ఇంగ్లండ్ ఖచ్చితంగా విజయం అంచున ఉన్నది. అయితే వెస్టిండిస్ బౌలర్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. చివరి 18 బంతుల్లో ఇంగ్లండ్‌కు కేవలం 09 పరుగులు మాత్రమే అవసరం.
చేతిలో రెండు వికెట్లున్నాయి. సోఫీ ఎక్లెస్టోన్ కేస్ క్రాస్ జంట క్రీజులో ఉన్నారు. అయినా వెస్టిండీస్ గెలిచింది. ఇంగ్లండ్ జట్టు 3 ఓవర్లలో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. రెండు వికెట్లు మిగిలాయి. ఎక్లెస్టోన్ 32, కేట్ క్రాస్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ ఆఫ్ స్పిన్నర్ అనిస్సా మహ్మద్‌కు బౌలింగ్ కు దిగింది. ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లి వెస్లిండిస్ ను గెలిపించింది.
Advertisement
Advertisement
48వ ఓవర్ మొదటి బంతి అనిస్సా మొహమ్మద్ వేసిన మొదటి బంతికి ఎక్లెస్టోన్ స్ల్రైక్‌లో ఉంది. ఆమె షాట్ ఆడగా బంతి నేరుగా అనిస్సా మహ్మద్ వేళ్లకు తగిలి వికెట్ కు తగులుతుంది. నాన్ స్ట్రైక్ పై నిలబడిన కేట్ క్రాస్ క్రీజ్ బయట ఉంటుంది. దీంతో ఆమె రనౌట్ అవుతుంది. చివరి బ్యాట్స్‌మెన్ అన్యషర్బాసోల్ స్ల్రైక్ లోకి వస్తుంది. 48వ ఓవర్, మూడవ బంతి- అనిస్సా మహ్మద్ వేసిన బంతిని షర్బాసోల్ ఆపుతుంది. పరుగులు ఏమి రావు. 48వ ఓవర్, నాలుగవ బంతి-షర్బాసోల్ ముందుకు వెళ్లి బంతిని ఆడేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అది మిస్ అయి వికెట్లకు తగులుతుంది. దీంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 పరుగుల తేడాతో విజయం సాధిస్తుంది.