ఐసీసీ తాజా వన్డే, టెస్ట్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా ప్లేయర్ క్వింటన్ డికాక్..కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టి మూడవ స్థానంలో నిలిచాడు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ నాలుగవ ర్యాంకును పడిపోయాడు. బ్యాట్స్‌మెన్ కోహ్లీ రెండవ స్థానాన్ని కాపాడుకున్నాడు. పాక్ సారథి బాబర్ అజామ్ అగ్రస్థానంలో నిలిచాడు.
Also Read : RRR : ఎన్టీఆర్ అరెస్ట్ సీన్.. థియేటర్లో ఒక్కరు కూడా కూర్చోరంట ఎందుకో తెలుసా..?
Advertisement
ఇక బౌలింగ్ విభాగంలో భారత జట్టు బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన ఆరవ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబుల్ హాసన్ తొలిస్థానంలో ఉండగా.. టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా ఒక్కస్థానం దిగజారి 10వస్థానంలో నిలిచాడు.
Advertisement
ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా మరొకసారి నెంబర్ వన్‌గా నిలిచాడు. 385 పాయింట్లతో జడ్డూ తొలిస్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో విండీస్ ప్లేయర్ జేసన్ హోల్డర్ ఉన్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క స్థానం దిగజారి 754 పాయింట్లతో ఏడవ స్థానంలో ఉండగా.. కోహ్లీ తొమ్మిదవ స్థానంలో నిలిచాడు. బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 885 పాయింట్లతో మొదటి స్థానాన్ని నిలుపుకోగా టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 850 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read : లక్ష్మీ పార్వతి కంటే ముందు ఆ హీరోయిన్ తో ఎన్టీఆర్ రెండో పెళ్లి…అందులో నిజమెంత..!