Telugu News » Blog » RRR : ఎన్టీఆర్ అరెస్ట్ సీన్.. థియేటర్లో ఒక్కరు కూడా కూర్చోరంట ఎందుకో తెలుసా..?

RRR : ఎన్టీఆర్ అరెస్ట్ సీన్.. థియేటర్లో ఒక్కరు కూడా కూర్చోరంట ఎందుకో తెలుసా..?

by Anji
Ads

దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది ఎప్ప‌టి నుంచో ఆస‌క్తిగా పాన్ ఇండియా అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన‌ ఆర్ఆర్ఆర్ సినిమా కేవ‌లం రెండు రోజుల్లోనే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ మ‌ల్టీసార‌ర్‌గా దర్శ‌క‌ధీరుడు రూపొందించిన ఈ చిత్రం మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నది. ఇప్ప‌టికే సినిమా ప్ర‌మోష‌న్ల జోరును పెంచిన మేక‌ర్స్ వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూల‌ను సోష‌ల్ మీడియాలో వ‌దులుతున్నారు.

Ads

Also Read :  మ‌గ‌ధీర విడుద‌లకు ముందు రోజు రాత్రి మెగాస్టార్ ఇంట్లో ఏమి జ‌రిగిందో తెలుసా..?

ముఖ్యంగా ఎవ్వ‌రూ ఊహించలేని విధంగా స్టార్ల‌తో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి ఆస‌క్తి పెంచేసాడు జ‌క్క‌న్న‌. ఇప్ప‌టికే టాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి, సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి, యాంక‌ర్ సుమ‌ల‌తో పాటు ఆర్ఆర్ఆర్ త్ర‌యం ఇంట‌ర్వ్యూలు సంచ‌ల‌నం సృష్టించాయో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇదిలా ఉండ‌గా తాజాగా ఎవ్వ‌రూ ఊహించ‌ని ద‌ర్శ‌కుడు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి రాజ‌మౌళిని ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేయడం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

Ads


ఆర్ఆర్ఆర్ గురించి ప్ర‌తి ఇంట‌ర్వ్యూలో ఏదో ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెల్ల‌డించే జ‌క్క‌న్న ఈ ఇంట‌ర్వ్యూలో అభిమానులు చొక్కాలు చింపుకునే విష‌యాన్ని చెప్పుకొచ్చాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్‌ను బ్రిటీష్ పోలీస్ అధికారి అయిన‌టువంటి రామ్ చ‌ర‌ణ్ అరెస్ట్ చేసే సీన్ ఉంటుంది. దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది. అక్క‌డ సుమారుగా 1000 మంది కొట్టుకుంటూ ఉంటారు. ఆ స‌మ‌యంలో ఏమి చేయాలో తోచ‌ని రామ్‌చ‌ర‌ణ్ కంట‌నీరు పెడుతూనే వారిని కొడుతూ ప‌క్కకు పంపించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. అప్పుడు అక్క‌డ ఎన్టీఆర్ కూడా ఉండ‌డంతో అరెస్ట్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది.

తొలుత ఈ సీన్ హాలీవుడ్ మాస్ట‌ర్ నేతృత్వంలో చేసిన అంత‌గా సంతృప్తి రాలేదు. ఆ త‌రువాత అదే సీన్ ను అనే సాల్మ‌న్ అనే ఫైట్ మాస్ట‌ర్‌కు అప్ప‌గించాం. అత‌డు స‌రిగ్గా చేస్తాడో లేదో అని అనుకున్నా. కానీ నెల రోజులు టెస్ట్ షూట్ చేసి తీసుకొచ్చి న‌న్ను ఇంప్రెస్ చేశాడు. దీంతో అత‌నే ఆ సీన్ చేశాడు. దాదాపు 2వేల మంది మంది ఉన్న ఆ సీన్ సినిమాకు హైలెట్‌గా నిలువ‌నుందని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ అరెస్ట్ సీన్ కి థియేట‌ర్‌లో ఎవ్వ‌రూ కూర్చొర‌ని జ‌క్క‌న్న ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు. ఇంకేముంది ఈ వ్యాఖ్య‌లు విన్న అభిమానులు చొక్కాలు చించుకోవ‌డానికి సిద్ధ‌మైపోయారట‌. ముఖ్యంగా జ‌క్క‌న్న థియేట‌ర్‌లో ఎవ్వ‌రూ కూర్చొరు అని చెప్ప‌డం బ‌ట్టి చూస్తుంటే ఇంట‌ర్వెల్ అవుతుందేమోన‌ని అభిమానులు ఓ అంచెనా వేస్తున్నారు. విరామ స‌మ‌యంలో అభిమానులు ఎవ్వ‌రూ ఉండ‌రు కాబ‌ట్టే జ‌క్క‌న్న ఇలా వ్యాఖ్యానించాడ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Ad

Also Read :  RRR : ప్ర‌చారం కోసం రాజ‌మౌళి ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రెవ‌రినీ వాడుకున్నాడు..?