Home » ఆ స‌మ‌స్య‌లే చ‌దివించాయి ఆమెను క‌లెక్ట‌ర్ ను చేశాయి…ఐఏఎస్ వేదితారెడ్డి స‌క్సెస్ స్టోరీ..!

ఆ స‌మ‌స్య‌లే చ‌దివించాయి ఆమెను క‌లెక్ట‌ర్ ను చేశాయి…ఐఏఎస్ వేదితారెడ్డి స‌క్సెస్ స్టోరీ..!

by AJAY
Ad

త‌మ కోసం తాము బ్ర‌తికేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ప్ర‌జ‌ల కోసం బ్ర‌తకాలి వారికి సేవచేయాలి అనే కోరిక క‌లిగిన‌వాళ్లు చాలా త‌క్కువ‌మంది ఉంటారు. కానీ అదే ఉద్దేశ్యంతో క‌ష్ట‌ప‌డి చ‌దివి 23 ఏళ్ల‌కే ఐఏఎస్ అధికారిని అయ్యారు వేదితా రెడ్డి. ఆమె తండ్రి కూడా ప్ర‌భుత్వ అధికారిగా సేవ‌లు అందించినవారే. వేదితా రెడ్డి తండ్రి నాగ‌భూష‌న్ రావు ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీసెస్ అధికారిగా సేవ‌లు అందించారు. వేదితారెడ్డి 2013లో నోయిడాలో బీటెక్ పూర్తిచేశారు.

Advertisement

ఆ స‌మ‌యంలోనే సివిల్స్ పై ఆస‌క్తితో ప‌రీక్ష‌రాసిన‌ప్పుడు ఆశించిన ర్యాంక్ రాలేదు. వేదితా రెడ్డి త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ ఏపీకి చెందినవారే. కాగా త‌ల్లి శ్రీకాకులం జిల్లాలోనే పుట్టి పెరిగారు. త‌ల్లిదండ్రుల‌నే స్పూర్తిగా తీసుకున్నాన‌ని..ఏపీకే మొద‌ట క్యాడ‌ర్ ను ఇచ్చాన‌ని వేదిక‌రెడ్డి చెప్పారు. సివిల్స్ దేశంలోనే అత్యున్న‌త సర్వీస్ అని వేదిక రెడ్డి చెప్పారు. దేశంలోని అత్యున్న‌త ఉద్యోగాలు సివిల్స్ తోనే సాధ్యం అవుతాయ‌ని అన్నారు.

Advertisement

త‌న త‌ల్లి శాంతిరెడ్డి వైసీపీ జిల్లా అధ్య‌క్షురాలు అని గ‌త ఎన్నిక‌ల్లో శ్రీకాకులంలో ఎంపీగా పోటీచేశార‌ని చెప్పారు. త‌న త‌ల్లి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రోజుల్లో జిల్లా మొత్తం ప‌ర్య‌టించాన‌ని చెప్పారు. ఆ ప‌ర్య‌ట‌న‌లో కొంత‌మంది పేద ప్ర‌జ‌ల ప‌రిస్థితి త‌న‌ను క‌దిలించింద‌ని అన్నారు. వారి జీవన విధానం స‌మ‌స్య‌లు ద‌గ్గ‌ర‌నుండి చూశాన‌ని అన్నారు. వారికి సేవ‌చేయ‌లనే ఉద్దేశ్యంతో రాత్రింబ‌వళ్లు క‌ష్ట‌ప‌డి చ‌దివి 71 ర్యాంకు సాధించాన‌ని తెలిపారు.

ALSO READ : మూల నక్షత్రం గల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది ?

Visitors Are Also Reading