Home » నా చేతి మీద ఉన్న ప‌చ్చ‌బొట్టు పోయేంత వ‌ర‌కు దీపును వ‌ద‌ల‌ను..!

నా చేతి మీద ఉన్న ప‌చ్చ‌బొట్టు పోయేంత వ‌ర‌కు దీపును వ‌ద‌ల‌ను..!

by Bunty
Ad

యూట్యూబ్‏లో వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న షణ్ముఖ్ జస్వంత్… బిగ్ బాస్ 5 సీజన్ లో అంతే స్థాయిలో నెగిటివీటిని మూటగట్టుకున్నాడు. సిరితో లవ్ ట్రాక్ తన విజయ అవకాశాన్ని దెబ్బతీసిందని ప్రచారం జరుగుతున్నా.. సిరితో స్నేహం కొనసాగుతుందని ఇన్ స్టా లైవ్ లో షణ్ముఖ్‌ చెప్పుకొచ్చాడు. దీప్తి సునయన్ తో బ్రేకప్ గురించి కూడా వివరించాడు. బిగ్‏బాస్ ఇంట్లోకి రాకముందే షణ్ముఖ్, దీప్తి సునయన్ ప్రేమలో ఉన్న విష‌యం తెలిసిందే. బిగ్ బాస్ హౌజ్ లో సరి-షణ్నూ మధ్య జరిగిన సంఘటనలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. బిగ్‏బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాకా మేమిద్దరం స్నేహితులమే అంటూ సిరి క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి రూమర్స్ రావడం కొత్తేమి కాదంటూ ఇప్పుడు షణ్నూ తెల్చీ చెప్పేసాడు.

Advertisement

Advertisement

తాజాగా తన ఇన్ స్టా లైవ్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలో ఎక్కువగా దీప్తి సునయన గురించి అడగడంతో బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తనను బ్లాక్ చేసిందని.. కోపం వచ్చినా.. అలిగిన ఇలాగే బ్లాక్ చేస్తుందని క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే హైద్రాబాద్ వెళ్లి తనను కలుస్తానని షణ్ముఖ్ చెప్పాడు. దీప్తి తన కారణంగా చాలా నెగిటివిటిని ఫేస్ చేసిందని.. అయినా తన కోసం నిలబడిందని చెప్పుకొచ్చాడు. ఇక తనతో బ్రేకప్ మాత్రం జరగదని, నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలను అంటూ షణ్ముఖ్ ఉద్వేగానికి లోనయ్యాడు.

 

షణ్ముఖ్ క్రేజ్ నటించిన సాఫ్ట్‏వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో షణ్నూ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఆ త‌రువాత‌ వచ్చిన సూర్య వెబ్ సిరీస్ కూడా అదే రేంజ్‏లో సూపర్ హిట్ అయింది. దీంతో షణ్ముఖ్ యూట్యూబ్ స్టార్‏గా పాపులారిటీని సొంతం చేసుకొని బిగ్‏బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టి రన్నర్ గా నిలిచాడు.

Visitors Are Also Reading