Home » ఆ క్షణాలు ఆనందించలేకపోయా.. చాలా భయపడ్డా.. సమంత సెన్షేషన్ కామెంట్స్..!

ఆ క్షణాలు ఆనందించలేకపోయా.. చాలా భయపడ్డా.. సమంత సెన్షేషన్ కామెంట్స్..!

by Anji
Ad

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఈమె ఏమాయచేశావే సినిమాతో 2010లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అంటే..  దాదాపు 14 ఏళ్ల సినీ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు నటి సమంత . యాక్టింగ్ నుంచి ఇటీవలే కొంచెం విరామం తీసుకున్న ఈ భామ ఇప్పుడిప్పుడే కెమెరా ముందుకు వస్తున్నారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ‘ఇండియాటుడే కాన్ క్లేవ్ 2024లో ఆమె పాల్గొన్నారు. తన కెరీర్, మయోసైటిస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

samantha

Advertisement

Advertisement

ఆ పరిస్థితుల కారణంగానే మయోసైటిస్ ఉందనే విషయాన్ని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు.  ‘నటిగా కెరీర్ మొదలుపెట్టి దాదాపు 14 ఏళ్లు అయ్యింది. ప్రతిరోజూ 10 రకాల పనులు చేసేదాన్ని. ఐదు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని. నా శరీరం, మనసుకు ఎలాంటి బ్రేక్ ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే, ఆ పద్నాలుగేళ్లలో కొన్ని బాధపడిన సంవత్సరాలున్నాయి. ఇంపోస్టర్ సిండ్రోమ్తో ఇబ్బందిపడిన క్షణాలున్నాయి. ఏదో ఒకరోజు నా నుంచి ఇది దూరమైపోతుందని భయపడేదాన్ని. ఈ సిండ్రోమ్ కారణంగా.. కెరీర్ అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఎంజాయ్ చేయలేకపోయా. విజయం సాధించినా అది నా వల్ల వచ్చింది కాదని.. వేరేవారి వల్ల వచ్చిందని భావించేదానిని’  అని సమంత చెప్పారు.

మయోసైటిస్ కారణంగా గతంలో తాను నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ (యశోద) ప్రమోషన్స్ కి దూరంగా ఉండాల్సి వచ్చిందని.. అప్పట్లో ఎన్నో వదంతులు వచ్చాయన్నారు. ప్రచారం చేయకపోతే సినిమా చనిపోయేలా ఉందని నిర్మాత చెప్పడంతో ఒకే ఒక్క  రోజు ఓ ఇంటర్వ్యూ  ఇచ్చానని తెలిపారు.  అప్పటి పరిస్థితుల రీత్యా తనకు మయోసైటిస్ ఉందని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు.

Also Read :  ఆ సినిమా షూటింగ్ లో సిల్క్ స్మితను చిరంజీవి కొట్టాడా..? కారణం అదేనా ?

Visitors Are Also Reading